RCB vs PBKS: రేపే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి పంజాబ్ కింగ్స్‌కి మధ్య ఈ సమరం జరగనుంది. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లకు, అభిమానులకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఐపీఎల్‌లో బెంగళూరు ఫైనల్స్ వరకు వెళ్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.
ఇప్పటివరకు బెంగళూరుకు ఒక్క ఐపీఎల్ కప్ కూడా లేదు. 18 ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతోంది. ప్రతి ఏడాది ఈసాల కప్ నమ్‌దే అనే నినాదంతో ముందుకెళ్తోందే తప్ప కప్ మాత్రం వరించడం లేదు. ఒక్కసారి కూడా కప్ కొట్టలేకపోవడంతో అప్పటివరకు టీంకు కెప్టెన్‌గా ఉన్న స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ టార్చర్, ప్రెషర్, ట్రోలింగ్స్ నేను భరించలేను బాబోయ్ అని కెప్టెన్సీని వదులుకున్నాడు.
ఈ ఏడాది రజత్ పాటిదర్ నేతృత్వంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్స్‌కు చేరడంతో ఆటగాళ్లు, అభిమానుల్లో ఎక్కడలేని ఆనందం మరోపక్క గెలుస్తామో లేదో అన్న బెరుకు ఉన్నాయి. ఒకవేళ కప్ కొడితే మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆనందానికి అవధులే ఉండవ్. నిజంగా కప్ గెలిచామా లేదా కలా అని నమ్మడానికి కూడా రెండు మూడు రోజులు పట్టేలా ఉంటుంది. నిజానికి పహల్గాం దాడి, ఆ తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఐపీఎల్ క్యాన్సిల్ చేస్తారేమో అనుకున్నారంతా.
అందులోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం మాంచి ఫాంలో ఉన్నప్పుడు ఐపీఎల్ సస్పెండ్ అయ్యింది. దాంతో ఆడక ఆడక బాగా ఆడుతుంటే ఏకంగా ఐపీఎల్ నిలిచిపోయింది.. ఈ టీంకి ఉన్న దరిద్రం ఎవ్వరికీ ఉండదు అని పాపం హేటర్స్ నుంచి ట్రోలింగ్ మామూలుగా జరగలేదు. ఏదైతేనేం మొత్తానికి బెంగళూరు ఫైనల్స్‌కు చేరుకుంది. పంజాబ్ కింగ్స్‌కి కూడా పాపం ఇప్పటివరకు ఒక్క టైటిల్ లేదు. కానీ పంజాబ్‌పై ఫోకస్ కంటే రాయల్ ఛాలెంజర్స్‌కే ఎక్కువగా ఉంది. RCB vs PBKS
వరుణుడొస్తే?
రేపు ఫైనల్ మ్యాచ్‌కి కోట్లాది కళ్లు ఎదురుచూస్తున్నప్పటికీ.. వరుణుడి మూడ్‌ని బట్టి మ్యాచ్ ఉంటుందో లేదో తెలుస్తుంది. ఎందుకంటే అహ్మదాబాద్‌లో రేపు వర్ష పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. వెస్ట్ బెంగాల్ రాజధాని కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌కు మార్చారు. ఎందుకంట కలకత్తాకు కూడా భారీ వర్ష సూచన ఉంది.
అయితే.. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉన్నందున ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోతే మరుసటి రోజు అంటే జూన్ 4న మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ ఆ రోజు కూడా మ్యాచ్ రద్దైతే మాత్రం పాయింట్ల పరంగా ఏ టీం అయితే టాప్‌లో ఉందో ఆ టీంకే కప్ వరిస్తుంది. ఆ రకంగా చూసుకుంటే కప్ పంజాబ్ కింగ్స్‌కే వరిస్తుంది. ఎందుకంటే పాయింట్లను బట్టి చూసుకుంటే పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంటే ముందుంది. సో.. ఫైనల్స్ వరకు వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్ కొట్టాలంటే కేవలం బాగా ఆడితే సరిపోదు.. వరుణుడి సహకారం కూడా ఉండాలన్నమాట. RCB vs PBKS
ఇంతకంటే పెద్ద కానుక ఇంకేముంటుంది?
విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలో ఇంగ్లాండ్‌లో జరగబోయే టెస్ట్ మ్యాచ్‌లకు ముందు విరాట్ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. సో.. రేపు కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో గెలిచి కప్ సాధిస్తే విరాట్‌కు ఇంతకుమించిన పెద్ద కానుక మరొకటి ఉండదు. అప్పుడు అభిమానులు కూడా రిటైర్మెంట్ బాధ నుంచి బయటపడతారు.