Search The Query
Search

Image
  • Home
  • Lifestyle
  • Divorces In India – భార‌త్‌లో విడాకుల‌కు ప్ర‌ధాన కారణం ఇదే

Divorces In India – భార‌త్‌లో విడాకుల‌కు ప్ర‌ధాన కారణం ఇదే

Divorces In India ఈ మ‌ధ్య‌కాలంలో భార‌త‌దేశంలో విడాకుల కేసులు మరీ ఎక్కువ అయిపోతున్నాయి. భార్యాభ‌ర్త‌లు గొడ‌వ ప‌డ‌టానికి ముందే విడాకుల దాకా వెళ్లిపోతున్నారు. అస‌లు విష‌యాన్ని లోతుగా ప‌రిశీలించలేక‌పోతున్నారు. కూర్చుని మాట్లాడుకుంటే తీరిపోయే గొడ‌వ‌లకు కూడా కోర్టు మెట్లు ఎక్కేస్తున్నారు. అయితే.. భార‌త‌దేశంలో విడాకుల సంఖ్య పెర‌గ‌డానికి కారణాలు అనేకం ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌ధానంగా మాత్రం నెస్ట్ సిండ్రోమ్ (Nest Syndrome) అని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

నెస్ట్ సిండ్రోమ్ అంటే ఏమిటి?

తల్లిదండ్రుల జీవితంలో పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు కలిగే మానసిక ఒత్తిడి, ఒంటరితనం అనుభవించే పరిస్థితిని “నెస్ట్ సిండ్రోమ్” అంటారు. ఈ రుగ్మ‌త‌ పిల్ల‌ల‌పై పెంచుకున్న విప‌రీత‌మైన ప్రేమ కారణంగా కలిగే ఆత్మీయతను కోల్పోయేలా చేస్తుంది.

నెస్ట్ సిండ్రోమ్ లక్షణాలు

ఒంటరితనం: ఇంట్లో పిల్లలు లేకపోవడం వల్ల మానసికంగా ఒంటరితనం అనుభవించడం.
నిరుత్సాహం: రోజువారీ జీవితంలో ఉత్సాహం లేకుండా బోసిపోయినట్లుగా అనిపించ‌డం.
ఆసక్తి కోల్పోవడం: న‌చ్చిన అంశాలు, హాబీల‌పై ఆసక్తి తగ్గడం.
సాంఘిక దూరం: స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో సంబంధాలు తగ్గడం.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం: డిప్రెషన్, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి సమస్యలు.

నెస్ట్ సిండ్రోమ్ కారణాలు

పిల్లలపై అధికంగా ఆధారపడటం: తల్లిదండ్రులు తమ జీవితంలో పిల్లలే సర్వస్వంగా బ‌తికేస్తుంటారు.
జీవనశైలిలో మార్పులు: పిల్లలు ఇంటిని విడిచిపెట్టిన తర్వాత వారి రోజువారీ జీవితం పూర్తిగా మారిపోవడం.
సాంప్రదాయ భావాలు: పిల్లలు తల్లిదండ్రులతో ఉండాలని భావించే సమాజంలో ఈ సమస్య ఎక్కువగా కనబడుతుంది.

ప్రభావాలు

మానసిక ఆరోగ్యం: దీర్ఘకాలిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలకు కారణం అవుతుంది.
శారీరక ఆరోగ్యం: ఒత్తిడి వల్ల రక్తపోటు త‌ద్వారా గుండె సమస్యలు ఎక్కువ అవుతాయి.
కుటుంబ సంబంధాలు: పిల్లలతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.

నివారణా చర్యలు

కొత్త హాబీల‌ను అల‌వ‌ర్చుకోవ‌డం

గార్డెనింగ్, పుస్తకాలు చదవడం, లేదా యోగా వంటి వాటిపై దృష్టిసారించడం

సాంఘిక సంబంధాలు బ‌ల‌ప‌ర్చుకోండి. బ‌య‌టివారితో క‌లివిడిగా ఉండండి.

స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సమయం గడపడం.

Divorces In India:  పైన చెప్పిన‌వేవీ ప‌నిచేయ‌క‌పోతే నిపుణుల‌ను సంప్ర‌దించ‌డం మంచిది. పిల్ల‌ల‌పై ఎంతో మ‌మ‌కారం పెంచుకుని వారు ఉన్న‌ట్టుండి కెరీర్ ప‌రంగానో మ‌రే కార‌ణం చేతనో ఇల్లు వ‌దిలి వెళ్లిపోతే నెస్ట్ సిండ్రోమ్ బారిన ప‌డిన త‌ల్లిదండ్రులు ఎంద‌రో ఉన్నారు. వారిలో కొంద‌రు విడాకులు తీసుకోగా మ‌రికొంద‌రు క‌లిసున్నా విడిపోయినా ఒక‌లాగే ఉంటున్నారు. నెస్ట్ సిండ్రోమ్ ఈరోజుల్లో సాధార‌ణ రుగ్మ‌త‌గా మారిపోయింది. దీని అర్థం పిల్ల‌ల గురించి ఆలోచిస్తూ మ‌న జీవితాల‌ను నాశ‌నం చేసుకోవ‌డం.. మాన‌సిక ఒత్తిడికి గురై అనారోగ్య స‌మ‌స్య‌లు తెచ్చుకోవ‌డం స‌రి కాదు క‌దా..!

మీలో కానీ మీకు తెలిసిన వారు కానీ ఈ రుగ్మ‌త‌తో బాధ‌ప‌డుతుంటే వారికి అండ‌గా నిల‌వాల్సిన బాధ్య‌త మీదే. వారికి త‌గిన స‌ల‌హాలు ఇవ్వండి. పిల్ల‌లు ఇంట్లో లేరు త‌మ‌తో లేరు అనే ఆలోచ‌న కూడా క‌ల‌గ‌కుండా చూసుకోవాలి. ఈ రుగ్మ‌త బారిన ప‌డిన చాలా మంది సింగిల్ పేరెంట్స్ నిపుణుల సాయంతో లేదా త‌మ ఆలోచ‌నా విధానం, కొత్త హాబీల‌తో బ‌య‌ట‌ప‌డి సంతోషంగా జీవిస్తున్న‌వారు ఉన్నారు. వారి జీవితాల గురించి ఉదాహ‌ర‌ణ‌గా చెప్పండి.

More News

India is in second position at Office Affairs
Office Affairs: ఆఫీస్‌లో అఫైర్స్.. టాప్ 2లో భార‌త్
BySai KrishnaNov 14, 2025

Office Affairs: కార్యాల‌యాల్లో అక్ర‌మ సంబంధాల విష‌యంలో భార‌త్ రెండో స్థానంలో ఉంద‌ట‌. ఇది అధికారికంగా YouGov. అనే అంత‌ర్జాతీయ…

Henna treats liver issues
Henna: గోరింటాకు.. కాలేయానికి శ్రీరామ‌ర‌క్ష‌
BySai KrishnaNov 1, 2025

Henna: ఫంక్ష‌న్ల‌కు, పెళ్లిళ్ల‌కు, పండ‌గ‌ల స‌మ‌యంలో స‌ర‌దాగా చేతికి పెట్టుకునే గోరింటాకు కాలేయానికి శ్రీరామ‌ర‌క్షా? అదేంటి.. ఇప్పుడు గోరింటాకును తిన‌మంటారా…

Hand Sanitizer causes cancers
Hand Sanitizer సానిటైజ‌ర్ల‌తో క్యాన్స‌ర్ ముప్పు
BySai KrishnaOct 21, 2025

Hand Sanitizer కోవిడ్ పుణ్య‌మా అని యావ‌త్ ప్ర‌పంచం సానిటైజ‌ర్ల‌ను మంచి నీళ్లు వాడిన‌ట్లు వాడేసింది. ఇప్ప‌టికీ ముందు జాగ్ర‌త్త‌గా…

all you need to know about man made fruits
Fruits మ‌నుషులు సృష్టించిన‌ పండ్లు
BySai KrishnaOct 13, 2025

Fruits దేవుడు చేసిన మ‌నుషులు అంటే అర్థ‌ముంది కానీ మ‌నుషులు చేసిన పండ్లేంటి? అస‌లు మ‌నుషులు పండ్లు త‌యారుచేయడం ఏంటి?…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top