Chandra Mangala Yogam: మనకి ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉంటాయి. ప్రతి రెండున్నర రోజులకు కొన్ని రాశులు మారితే.. ప్రతి నెలకు, 45 రోజులకు.. ఇలా వాటి గమనాన్ని బట్టి ప్రతి నిమిషం మారుతూనే ఉంటాయి. గ్రహం అంటేనే చెరించేది అని అర్థం. ఇప్పుడు మనకు చాలా అరుదైన సంభవించే చంద్రమంగళ యోగం గురించి చెప్పుకుందాం. ఈ గ్రహాల పరిభ్రమణం, గమనం మనకు ఖగోళ శాస్త్రంలో ప్రతి సమయంలోనూ తరచూ జరుగుతూ ఉంటాయి.
ఒక రాశి నుంచి మరో రాశికి ప్రతి గ్రహం మారే సమయంలో కొన్ని కొన్ని గ్రహాల కలయిక ఒక్కోసారి రెండు సార్లు కలుస్తాయి.. ఒక్కోసారి నాలుగు, ఐదు, ఆరు.. ఇలా వాటి పరిభ్రమణం జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి 25వ తారీఖులో మొత్తం 7 గ్రహాలు కలిసి ఒకే కక్ష్యలో ఉండబోతున్నాయి. కొన్ని సంవత్సరాలకు అరుదుగా జరిగే అంశం ఇది. అలా అరుదుగా జరిగేదే ఈ చంద్రమంగళ యోగం. అయితే.. ఈ చంద్రమంగళ యోగం వల్ల ఈ రాశులు మారడం వల్ల రకరకాల ఫలితాలు వస్తుంటాయి. ఏ రాశిలో ఏ గ్రహాలు ఎలా పరిభ్రమణం చేస్తున్నాయి.. అవి ఏ సమయంలో చేస్తున్నాయి.. వాటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.
Chandra Mangala Yogam ఫిబ్రవరి 26న శివరాత్రికి ఇలా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుండడంతో అద్భుతమైన ప్రయోజనాలు ప్రతి ఒక్క రాశి వారికి కలగబోతున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 26న మకర రాశిలో కుజుడు చంద్రుడితో కలయిక అవ్వడం వల్ల చంద్రమంగళ యోగం అనేది సంభవించబోతోంది. అయితే… మనకి ప్రతి ఏడాదిలోనూ ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్షం చతుర్దశి రోజున మనకు మహా శివరాత్రి వస్తుంది. అయితే.. ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 26న ఏర్పడబోతోంది. ఈ మహా శివరాత్రిని చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాం. ప్రతి నెలా వచ్చేది మాస శివరాత్రి అయితే.. మహా శివరాత్రి సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. ఈ క్రమంలో శని దేవుడు తన సొంత రాశి అయిన కుంభ రాశి నుంచి శని దేవుడు, శుక్రుడు, సూర్యుడు అరుదుగా కలవబోతున్నారు. దీనిని త్రిగ్రాహి కలయిక అంటారు. ఇది చాలా అరుదుగా మన ఖగోళ శాస్త్రంలో జరగబోతోంది. అయితే.. ఇది ఇలా జరగడం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం.
ఈ కలయిక 300 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చిందట. మళ్లీ ఈ నెల 26న జరగబోతోంది. అయితే.. ఈ చంద్రమంగళ యోగం అంటే ఏంటి? ప్రతిసారీ మనకు కొన్ని కొన్ని యోగాలు కొన్ని కొన్ని రాజయోగాలు, మహా రాజయోగాలు కూడా ఈ గ్రహాల మార్పు వల్ల జరుగుతుంటాయి. ఈ చంద్రుడు, మంగళుడు కలిసి ఒకే రాశిలో ఉంటూ పరస్పర దృష్టి.. అంటే ఇద్దరూ ఎదురుగా చూసుకునే దృష్టి కలవడం అనేది చాలా అపురూపమైన సంయోగం. ఆ సంయోగమే మనకు ఇప్పుడు కలగబోతోంది. అయితే.. దీని వల్ల మనకు ఏం జరుగుతుంది? ఈ రెండు గ్రహాలు ఎదురెదురుగా చూసుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి, ఆత్మ విశ్వాసం, సాహసం, శరీర బలం, ఆరోగ్యం.. ఇలా అన్ని విశేషమైన ఫలితాలు మనకు ఈ రెండు గ్రహాలు కలిగిస్తాయి.
మేష రాశి (Aries)
మేష రాశి వారికి ఈ చంద్రమంగళ యోగం వల్ల శక్తి, ధనప్రాప్తి దాంతో పాటు ఏ పని తలపెట్టినా విజయాలను సాధిస్తారు. అయితే.. ఉద్యోగస్తులకు చూసుకున్నట్లైతే.. ఉన్నతాధికారుల మద్దతు, పదోన్నతులు కలిసి వస్తాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు వస్తాయి.
కన్యా రాశి (Virgo)
ఈ కన్యా రాశిలో ఉండేవారికి చంద్రమంగళ యోగం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయంటే.. ఉద్యోగస్తులకు పెద్ద స్థాయిలో మార్పులు సంభవిస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, శుభవార్తలు వింటారు. అన్ని రకాలుగా మీకు అనుకూలమైన సమయమే. దీంతో పాటు కొంత మందికి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కఠినమైన పనుల ద్వారా అభివృద్ధిని సాధిస్తారు. అంటే మీరు డెవలప్ అవ్వాలంటే కొంత హార్డ్‌వర్క్ తప్పనిసరిగా చేయాల్సిందే. కానీ ఒత్తిడి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది.
స్ట్రెస్ మేనేజ్‌మెంట్ చేసుకోవాల్సిందే. కన్యా రాశి వారు ప్రతి సోమవారం నాడు శివుడికి సంబంధించిన ఏ స్తోత్రాన్నైన్నా పఠించడం కానీ వినడం కానీ చేస్తే మంచిది. కన్యా రాశికి చెందిన వ్యాపారస్తులకు మాత్రం కాస్త కలిసిరాదనే చెప్పాలి. పనులు మందకొడిగా సాగడం.. అడుగడుగునా ఆటంకాలు రావడం వంటివి జరుగుతుంటాయి. కొంతమందికి డబ్బు పరంగా అనవసరమైన ఖర్చులు పెరగడం.. ఏదేదో చేయాలనుకుని ఏదేదో చేసేయడం.. ఒక రకమైన గందరగోళ పరిస్థితి ఈసారి కనిపిస్తోంది. దాని క్రమబద్ధీకరణ చేసుకుని ముందు ఒక ప్లాన్ ప్రకారంగా అడుగులు వేస్తూ ఉండాలి.