Casual Sex క్యాజువల్ సెక్స్.. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఒక మంచి రిలేషన్షిప్ కంటే దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చర్చనీయాంశం అయ్యిందంటే.. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్.. వివాదాస్పద పాడ్‌కాస్టర్ రణ్వీర్ అల్హాబాదియా షోలో పాల్గొన్నారు. ఆయన ఈ క్యాజువల్ సెక్స్ గురించి మాట్లాడారు. దాంతో ఇప్పుడు ఇది నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటికే చాలా సంవత్సరాలుగా సెక్స్ గురించి జరుగుతున్న చర్చలు సరైన దిశలోనే ఉన్నాయి. తన శరీరం మీద తనకు హక్కు ఉండాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు అన్నది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమే. ఈ దృష్టిలో చూస్తే, క్యాజువల్ సెక్స్‌ను ఆధునికతకు, ఆత్మవిశ్వాసానికి, స్వేచ్ఛకు చిహ్నంగా చూపిస్తుంటారు. కానీ ఇక్కడ మనం అసలు మాట్లాడని విషయం ఏమిటంటే ఆ క్యాజువల్ సెక్స్ తర్వాత ఏమవుతుంది? మన మనస్సు “ఇది కేవలం సరదా” అని అనుకున్నా, శరీరం అలా అనుకోవడం లేదు. సెక్స్ సమయంలో మెదడులో ఆక్సిటోసిన్, డోపమైన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. తల్లి శిశువు మధ్య అనుబంధానికి కారణమయ్యే హార్మోన్లు కూడా ఇవే.
అంటే శరీరం సహజంగానే ఒక అనుబంధాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ మనం దానికి విరుద్ధంగా, “అటాచ్ కావద్దు” అని మన బ్రెయిన్ అండ్ హార్ట్‌ని ట్రెయిన్ చేస్తున్నాం. దీని వల్ల చాలా మందిలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే.. ఒక తెలీని వ్యక్తి మన పక్కన నిద్రలేచినా ఒంటరితనంగా ఉండటం.. ఇంటికి వెళ్లాక కారణం తెలియకుండా ఏడవడం… వరుస హుక్-అప్స్ తర్వాత ఏదో లోటుగా ఉండటం.. ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్ కలుగుతాయి.
ఒక సెలబ్రిటీ దీని గురించి పాడ్‌కాస్ట్‌లో స్పందించడంతో.. ముంబైకి చెందిన సైకాలజిస్ట్, గైనకాలజిస్ట్లు తమ అభిప్రాయాలను వెల్లడించడం మొదలుపెట్టారు. కొంతమందికి ఈ క్యాజువల్ సెక్స్ అనేది సరదా అయితే, మరికొందరికి ఇది తెలియకుండానే తీసుకున్న భావోద్వేగ అప్పు లాంటిదని అంటున్నారు.





