Viral News: పెద్దలు పెళ్లి నిశ్చయించినప్పుడు ఆ పెళ్లి ఇష్టమో లేదో ముందే చెప్తే ఇలాంటి దరిద్రాలు సమాజంలో జరగవు. కానీ అందరికీ ఆ అవకాశం ఉండకపోవచ్చు. కొందరు ఆడవాళ్లైనా, మగవాళ్లైనా ఇంట్లో వారికి ఎదురు చెప్పలేక ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత భాగస్వామికి, అత్తామామలకు తెలీకుండా సీక్రెట్ ఎఫైర్ నడిపిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు దేశంలో రోజులో ఒక పది వరకైనా జరుగున్నాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే.. ఈ ఘటన మాత్రం హైలైట్‌గా ఉంటుంది. ఇలాంటి అత్త అందరికీ ఉంటే ఎన్నో కాపురాలు బాగుపడతాయనే చెప్పాలి.
ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆమ్రోహి ప్రాంతానికి చెందిన ఓ యువతికి ఆల్రెడీ పెళ్లై అత్తింట్లో ఉంటోంది. అయితే.. భర్త ఆఫీస్‌కి వెళ్లిపోగానే ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన అబ్బాయితో తెగ కబుర్లు చెప్పేది. ఇంట్లో పనులు కూడా మానేసేది. చాలా సార్లు అత్త మందలించినా ఇదిగో చేస్తున్నా అదిగో చేస్తున్నా అంటూ ఆ ఫేస్‌బుక్‌కే అతుక్కుపోయేది. కొద్ది రోజుల్లోనే వాళ్లు రోజూ ఫోన్‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దాంతో అత్తకు అనుమానం వచ్చి కోడలు ఫోన్ చార్జింగ్ పెట్టిన సమయంలో ఫోన్ చెక్ చేసింది. తను ఎవరో అబ్బాయితో ఫోన్ కాల్స్ మాట్లాడుతూ.. ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేస్తోందని తెలుసుకుంది. అయితే.. ఇప్పటివరకు అతన్ని కలవలేదని తెలిసి ఒక బ్లాక్‌బస్టర్ ప్లాన్ వేసింది. (Viral News)
ఇక ఇలా చూసుకోకుండా ఎన్ని రోజులని మాట్లాడుకుంటాం.. కలుద్దాం అని కోడలి ఫోన్ నుంచి ఆ వ్యక్తికి మెసేజ్ చేసింది. ఆదివారం రోజు ఫలానా ప్రాంతానికి రావాలని అడ్రెస్ పెట్టింది. అవతలి వ్యక్తి ఆ అమ్మాయిని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని కాచుకుని కూర్చున్నాడు. తీరా తనే స్వయంగా కలుద్దామని చెప్పింది కాబట్టి టిప్‌టాప్‌గా రెడీ అయ్యి ఆమె చెప్పిన చోటికి వెళ్లాడు. ఆ అబ్బాయే తన కోడలితో చాటింగ్ చేస్తున్నాడని తెలుసుకున్న ఆ అత్త వాడిని నడిరోడ్డుపై చెప్పుతో చావగొట్టింది. స్థానికులు ఏం జరిగింది అంటున్నా ఆమె వినిపించుకోకుండా రెచ్చిపోయింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు వచ్చే లోపే ఆమె వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ అబ్బాయి చావుదెబ్బలు తిని కుంటుకుంటూ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే పోలీసులు మాత్రం కేసు లాంటివి నమోదు చేయలేదు. ఇక ఇంటికి వెళ్లాక ఆ అత్త కోడలిని మందలించిందో లేక వాడు చచ్చినా మళ్లీ మెసేజ్ కానీ కాల్ కానీ చేయడు అని వదిలేసిందో..! (Viral News)