Vasantha Panchami: మాఘమాసంలో శుక్ల పక్షంలో వచ్చే పంచమి తిథిని శ్రీ పంచమి, వసంత పంచమి అంటారు. ఇది సరస్వతి దేవి పుట్టిన రోజు. 2025లో ఫిబ్రవరి 2న వసంత పంచమి వచ్చింది. ఈరోజు సరస్వతి దేవి పుట్టిన రోజు సందర్భంగా మీరు ఏ రంగంలో ఉన్నా సరే బాగా రాణించాలన్నా.. జనాకర్షణ పెరగాలన్నా.. మీ మాటలతో ఎదుటి వారితో ఆకట్టుకుని మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోవాలంటే ఇంట్లో దీపం పెట్టి సరస్వతి దేవికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే.. ఓం వద వద వాగ్వాదిని స్వాహా. ఈ మంత్రాన్ని దీపం పెట్టాక 21 సార్లు చదువుకోవాలి. ఆఫీసులకు వెళ్తున్నప్పుడైనా, వ్యాపార సంస్థలకు వెళ్తున్నా.. అలాంటప్పుడైనా ఈ మంత్రాన్ని చదువుకుంటూ వెళ్తే మీ పనులన్నీ జరిగిపోతాయి.
పోటీ పరీక్షల్లోనూ విజయం సాధించడానికి కూడా ఈ మంత్రం ఎంతో పనిచేస్తుంది. అలాగే.. వసంత పంచమి సందర్భంగా సరస్వతి దేవిని ప్రత్యేకంగా పూజిస్తే ఆమె సంపూర్ణమైన అనుగ్రహం, అఖండ అదృష్టాన్ని కలిగిస్తుంది. అద్భుతమైన జ్ఞాపకశక్తి, ప్రజ్ఞాపాఠవాలు, పిల్లలు చదువులో బ్రహ్మాండంగా రాణించాలంటే.. మంచి ర్యాంకులు రావాలన్నా ఈరోజు సరస్వతిని పూజించాలి. ఇంతకీ ఆమెను ఎలా పూజించాలంటే.. మీ ఇంట్లో సరస్వతి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే.. గంధం, కుంకుమ బొట్లు పెట్టి ఒక ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 వత్తులు వేసి దీపం వెలిగించాలి. ఎందుకంటే సరస్వతి దేవికి తొమ్మిది వత్తుల దీపం అంటే చాలా ఇష్టం.
Vasantha Panchami సరస్వతి దేవి తెల్లగా ఉంటారు కాబట్టి.. ఆమెకు తెల్లటి పుష్పాలతో మాత్రమే పూజించాలి. సరస్వతి దేవికి ఇష్టమైన కొన్ని నైవేధ్యాలు ఉన్నాయి. అవేంటంటే.. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి.. ఇవన్నీ ఆమెకు ఎంతో ప్రీతి. వెన్నంటే ప్రాణం. అలాగే.. తెల్ల బెల్లం, పేలాలు, చెరుకు కూడా అమ్మకు చాలా ఇష్టం. అన్నింటికంటే సరస్వతి దేవికి ఇష్టమైన నైవేధ్యం ఏంటో దేవి భాగవతంలో చెప్పారు. అదేంటంటే.. పాయసాన్నం. ఏ ఇంట్లో అయితే సరస్వతి దేవి పుట్టిన రోజున నాడు అంటే వసంత పంచమి రోజున పాయసాన్నం చేసి ఆమెకు నైవేధ్యంగా పెట్టి.. కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరిస్తారో వారికి సరస్వతి దేవి సంపూర్ణ అనుగ్రహం కలిగిస్తుంది. ఈ పాయసాన్నం వల్ల మేథాశక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతుందట.
చాలా మంది పిల్లలు ఇళ్లల్లో చదువు మీద ఆసక్తి చూపించకుండా.. ఇతర పనుల మీద ఆసక్తి చూపించడం.. స్నేహితులతో తిరగడం.. శ్రద్ధగా చదవకపోవడం.. ఏకాగ్రత లేకపోవడం.. ఇవన్నీ ఉంటే అలాంటి పిల్లలు అంతా సరైన మార్గంలోకి రావాలంటే తల్లిదండ్రులు వసంత పంచమి రోజున ఈ చిన్న పరిహారం చేస్తే మంచిది. అదేంటంటే.. ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్ల మీద నాలుగు వేళ్లు వచ్చేలా మీ అరచేతిని ఉంచండి. చూపుడు, మధ్య, ఉంగరం, చిటికెన వేలు ఆ గ్లాసుపై ఉండాలి. ఓం ఐం వాణ్యై స్వాహా అనే మంత్రాన్ని తల్లి కానీ తండ్రి కానీ 21 సార్లు చదవాలి. ఆ తర్వాత ఆ నీటిని పిల్లలకు తాగించండి. వారి చదువు గురించి కెరీర్ గురించి సరస్వతీ అమ్మవారే చూసుకుంటారు.
Vasantha Panchami సరస్వతి దేవికి సంబంధించిన రెండు స్తోత్రాలు ఉన్నాయి. ఆ స్తోత్రాలను విన్నా కూడా అఖండ అదృష్టం వరిస్తుందని అంటారు. అవేంటంటే.. సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం. ఈ స్తోత్రం వింటే చాలా మంచిది. మరొకటి ఏంటంటే.. సరస్వతి కవచం. ఇది విన్నా మంచిదే. ఈ స్తోత్రానికి విశ్వ జయం అనే మరో పేరు ఉంది. ఈ రెండింట్లో ఏదో ఒకటి ఈరోజు విన్నా.. లేదా రోజూ చదువుకున్నా ఎంతో మంచిది.