Vaibhav Suryavanshi: ఈరోజు UAEతో జరిగిన U19 ఆసియా కప్ మ్యాచ్‌లో 14 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి చేదు అనుభవం ఎదురైంది. UAEపై 171 పరుగులు తీసి చుక్కలు చూపించిన ఈ యువ కెరటాన్ని చూసి ప్రత్యర్ధి ఆటగాడు, UAE వికెట్ కీపర్ సలే అమీన్ ఓర్వలేకపోయాడు. పిల్లాడు అని కూడా చూడకుండా స్లెడ్జింగ్‌కు దిగాడు. మనోడు ఊరుకుంటాడా? అసలే కుర్రాడు. ఆకలి మీదున్నాడు.
“” నేను బిహార్ నుంచి వచ్చా. నా వెనక ఎవడు ఎన్ని వాగినా నాకు అసలు ఫరక్ పడదు. నా వెనక వికెట్ కీపింగ్ చేస్తూ నన్ను తిడుతూ ఏదేదో వాగుతూనే ఉన్నాడు. కానీ నా ఫోకస్ గేమ్‌పై మాత్రమే ఉంది. నా బ్యాటింగ్ స్టైల్‌తోనే వాడికి సమాధానం ఇచ్చా “” అని మ్యాచ్ అనంతరం వైభవ్ తన అనుభవాన్ని వెల్లడించాడు. ఇక గూగుల్ 2025లో అత్యధిక మంది సెర్చ్ చేసిన సెలబ్రిటీల్లో వైభవ్ విరాట్ కోహ్లీ, ధోనీల కంటే ముందున్నాడు. దీని గురించి అడగ్గా.. ఇది తాను కూడా విన్నానని.. అవునా అనుకుని వదిలేస్తానే తప్ప అదేదో పెద్ద విషయంగా పరిగణించనని తెలిపాడు.





