USA Venezuela: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రెండు రోజుల క్రితం వెనెజ్వెలాపై మిలిటరీ దాడులు చేపట్టి ఆ దేశ అధ్యక్షుడు నికోలా మడురో, అతని భార్యను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఎందుకు చేసారు అని ట్రంప్ అడిగితే.. నా దేశంలోకి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నాడు. నా దేశం జోలికి వస్తే నేను ఊరుకుంటానా అని వార్నింగ్‌లు ఇచ్చాడు. కానీ అసలు మ్యాటర్ ప్రపంచానికి తెలీదు అనుకుంటున్నాడు ట్రంప్ గారు. వెనెజ్వెలాపై దాడులు చేయడం… ఆ దేశ అధ్యక్షుడిని అతని భార్యని పట్టుకురావడం వెనక అసలు కారణం మాదకద్రవ్యాలు కాదు.
ట్రంప్ నోబెల్ ప్రైజ్ కోసం తెగ పాకులాడిన సంగతి తెలిసిందే. ఇందుకోసం తాను యుద్ధాలు ఆపానని డప్పాలు కొట్టుకుంటూ నోబెల్ ప్రైజ్ దక్కించుకోవాలని చూసాడు. కానీ అది కుదరలేదు. చివరికి ఆ నోబెల్ ప్రైజ్ వెనెజ్వెలా ప్రస్తుతం ప్రతిపక్ష నేత అయిన మరియాకి దక్కింది. ఇది ట్రంప్ జీర్ణించుకోలేకపోయాడు. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లు.. మడురోకి ప్రతిపక్ష నేత అయిన మరియాను ట్రంప్ కలవాలనుకున్నారు. ఇందుకోసం ఆమెను వైట్ హౌస్‌లో సంప్రదించినట్లు సమాచారం.
అప్పుడే వారిద్దరి మధ్య ఒక సీక్రెట్ ఒప్పందం జరిగిందట. అదేంటంటే.. మడురోని తప్పిస్తే మళ్లీ ఎన్నికలు వచ్చి మరియా గెలవాలని వెనెజ్వెలాకు అధ్యక్షురాలు అవ్వాలని భావిస్తోంది. ఈ విషయాన్ని ట్రంప్‌తో డిస్కస్ చేయగా.. ఇందుకు ట్రంప్ ఒప్పుకున్నారు. ఇది కానీ జరిగితే మరియా తనకు నోబెల్ బహుమతి రావడానికి కారణం ట్రంపే అని బహిరంగంగా ప్రకటిస్తానని మాటిచ్చిందట. ఇందుకోసం ట్రంప్ మడురోని ఎలా తప్పించాలా అని ప్లాన్లు వేసి మొత్తానికి సాధించాడు.
ఇప్పుడు వెనెజ్వెలాకి అధ్యక్షురాలిగా ఆ దేశ ఉప అధ్యక్షురాలు డెల్చీ రోద్రీగ్జ్ ప్రమాణ స్వీకారం చేసింది. ఆమె మద్దతు మడురోకే. కానీ అమెరికా వెనెజ్వెలాను ఆధీనంలోకి తెచ్చుకుని.. త్వరలో ఎన్నికలు నిర్వహించేలా చేస్తుంది. ట్రంప్ మరియా ప్లాన్ ప్రకారం.. ఆమెకు సపోర్ట్ చేసి గెలిపిస్తే మరియా అనుకున్నట్లు అధ్యక్షురాలు అవుతుంది. అలా మరియా ట్రంప్ ఒక్కటై మడురోను ఒంటరిని చేసి ఇరికించేసారని అంతర్జాతీయ మీడియా వర్గాలు కోడైకూస్తున్నాయి. నోబెల్ ప్రైజ్ విషయమే కాదు.. వెనెజ్వెలా చమురు నిల్వలకు పెట్టింది పేరు కాబట్టి.. వాటిని కూడా ట్రంప్ తన ఆధీనంలోకి తెచ్చుకుని చైనా, రష్యాలతో పాటు ఇతర దేశాలను కూడా చమురు కోసం అమెరికా ముందు చేతులు జాచే పరిస్థితి తేవాలని ప్లాన్లు వేస్తున్నాడు.





