Turkey: ఇద్దరు కొట్టుకుంటే మూడో వాడికి లాభం అన్నట్లు.. భారత్ (India), బంగ్లాదేశ్ (Bangladesh) మధ్య రాజకీయ రచ్చ రోజురోజుకీ వేడెక్కుతున్న తరుణంలో ఇదే మంచి సమయం అని భావించిన టర్కీ నక్క బుద్ధిని బయటపెట్టింది. భారత్‌కే ఎసరు పెట్టాలని చూస్తోంది. మనకు బంగ్లాదేశ్‌కు రాజకీయంగా మనస్పర్ధలు ఉన్నప్పటికీ వ్యాపారానికి సంబంధించిన ఎగుమతులు, దిగుమతుల విషయంలో బాగానే సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో భారత్ కాస్త పెద్ద మనసుతో వ్యవహరిస్తుండడంతో.. ప్రస్తుత బంగ్లాదేశ్ “ప్రధాని” మహ్మద్ యూనస్ మొండికేస్తున్నాడు.
టర్కీ జిత్తులమారి ప్లాన్
దాంతో ఇక భారత్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని.. హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పజెప్పకుండా సాయం చేస్తున్న భారత్ ఈ విషయంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. కానీ మన ప్రభుత్వం ఇలాంటి అల్లాటప్పా బెదిరింపులకు పాల్పడదు కదా. ఈ గొడవంతా దగ్గరుండి చూస్తున్న టర్కీ నక్క ప్లాన్ వేసింది. ఎటూ బంగ్లాదేశ్‌కి భారత్‌కి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి.. బంగ్లాదేశ్‌లో మన స్థానాన్ని భర్తీ చేయాలని టర్కీ ప్లాన్‌లో ఉంది. ఈ నేపథ్యంలో టర్కీ (Turkey) అధ్యక్షుడు టయ్యిప్ ఎర్డోగన్ బంగ్లాదేశ్‌తో చర్చలు జరుపుతున్నాడు. ఇటీవల టర్కీకి చెందిన ట్రేడ్ మినిస్టర్ ఒమర్ బొలాట్.. మహ్మద్ యూనస్‌ను కలిసాడు. ఈ నేపథ్యంలో యూనస్ టర్కీని బంగ్లాదేశ్‌కు ఆహ్వానించాడు. టర్కీకి సంబంధించిన ఎలాంటి పెట్టుబడులైనా బంగ్లాదేశ్‌లో పెట్టుకోవచ్చని.. దీని వల్ల బంగ్లాదేశ్ యువతకు ఉద్యోగాలు కల్పిస్తే అంతకంటే ఏం కావాలని చెప్పాడు.
అప్పుడే చుట్టాలైపోయారు
అంతేకాదు.. బంగ్లాదేశ్ యువతను టర్కీకి వెళ్లి అక్కడ కార్మాగారాల్లో పని చేయాలని సూచించాడు. బంగ్లాదేశ్ డిఫెన్స్ శాఖను బలోపేతం చేయడం కోసం టర్కీ సాయం కావాలని.. టర్కీ వద్ద ఉన్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని బంగ్లాదేశ్‌కు ఇవ్వాలని కోరాడు. ఇందుకు టర్కీ కూడా ఒప్పుకుంది. ఆల్రెడీ 2023 నుంచి 2024 మధ్యలో బంగ్లాదేశ్ టర్కీ నుంచి 581 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.. అదే విధంగా టర్కీ నుంచి ఏకంగా 4.24 బిలియన్ డాలర్ల విలువైన సామాన్లు దిగుమతి చేసుకుంది.
పాక్ కుక్క బుద్ధి
భారత్‌కు మరో దేశంతో విరోధం ఉంటే.. ఆ దేశంతోనే స్నేహం చేయాలని కుక్కలా కాచుకుని కూర్చునే అలవాటు పాకిస్థాన్‌కు (Pakistan) ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ భారత్‌తో తెగదెంపులు చేసుకుని ఆ స్థానాన్ని టర్కీని ఇవ్వాలని చూస్తుంటే ఇప్పుడు పాకిస్థాన్ ఇదే అదనుగా చూసి నేను కూడా సాయం చేస్తా అంటూ ముందుకొచ్చింది. అలా బంగ్లాదేశ్, పాకిస్థాన కలిసి ఈ ఫిబ్రవరిలో నేవీకి సంబంధించిన కార్యకలాపాలను మొదలుపెట్టబోతున్నారు. 1971 తర్వాత తొలిసారి పాకిస్థాన్ బంగ్లాదేశ్‌తో కలిసి పనిచేస్తోంది. టర్కీకి బంగ్లాదేశ్‌తో పెరుగుతున్న సాన్నిహిత్యం కొంత వరకు భారత్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. (Turkey)
బంగ్లాదేశ్‌కి భారత్‌తో గొడవేంటి?
గతేడాది బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడికిపోయింది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రత్యేక విమానంలో హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఆమె యూకే వెళ్లాల్సి ఉంది. ఆ దేశం నుంచి అనుమతి వచ్చేవరకు హసీనా ఇండియాలోనే ఉంటారు. అయితే.. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అల్లర్ల విషయంపై పలువురు విశ్లేషకులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇండియాను ట్రాప్ చేయడానికి ఐఎస్ఐ కానీ చైనా కానీ వేసిన ప్లాన్ అయితే కాదు కదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లేకపోతే బంగ్లాదేశ్‌లో అల్లర్లు జరుగుతుంటే హసీనా వెంటనే ఢిల్లీ రావడం ఏంటి? ఆమెకు ఇండియా నుంచి వెంటనే అనుమతి వస్తుందని ఏమన్నా ప్లాన్ చేసారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
భారత్‌ను దెబ్బతీసేందుకు చైనా, ISI చేయని కుట్రలు అంటూ లేవు. ఈ బంగ్లాదేశ్ అల్లర్లు కూడా ఆ కుట్రల్లో భాగమేనా అని యోచిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో ఆర్మీ ఎప్పుడూ ఏదో ఒక విధ్వంస కాండ సృష్టిస్తూనే ఉంటుంది. 1975లో కూడా ఇలాగే అల్లర్లు చోటుచేసుకుంటే ఆ దేశ ఆర్మీ అప్పటి ప్రధాని అయిన ముజిబుర్ రెహమాన్ ప్రభుత్వాన్ని కూల్చేసింది. ముజీబుర్ రెహ్మాన్ ఎవరో కాదు.. షేక్ హసీనా తండ్రి. ఆయన ఆర్మీ చేతుల్లోనే దారుణ హత్యకు గురయ్యారు. రెహ్మాన్ చనిపోయాక బంగ్లాదేశ్‌లో 15 ఏళ్ల పాటు ఆర్మీ పాలన జరిగింది. ఆ తర్వాత హసీనా ఆవామీ పేరుతో రాజకీయాల్లోకి రావడం మూడు సార్లు ప్రధానిగా గెలవడం జరిగాయి. (Turkey)
అయితే ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అల్లర్లు మళ్లీ మిలిటరీ పాలన తీసుకురావాలనే ఉద్దేశంతో జరుగుతున్నాయేమో అని ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే స్పష్టమవుతోంది. 1971లో బంగ్లాదేశ్‌కు స్వాతంత్రం రాగానే పాకిస్థాన్ బంగ్లాను తొక్కేయాలని వేయని ప్లాన్ అంటూ లేదు. ఇప్పుడు కూడా ఈ అల్లర్లను పాకిస్థాన్ ISI సాయంతో సృష్టించిదేమో ఇందుకు చైనా కూడా సాయం చేసిందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయట. షేక్ హసీనాకు ఇండియాతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. కానీ చైనా అంటే హసీనాకు ఒళ్లుమంట. ఇప్పుడు హసీనా రాజీనామా చేసింది కాబట్టి బంగ్లాదేశ్‌పై చైనా ఆధిపత్యం చెలాయించే అవకాశం లేకపోలేదు.
బంగ్లాదేశ్‌లో అల్లర్లు చోటుచేసుకోవడం.. దాని వల్ల దాదాపు 300 మంది పౌరులు చనిపోవడం వెనుక బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చీఫ్, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. జియా కుమారుడు తారీఖ్ రెహ్మాన్ లండన్.. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ సాయం తీసుకుని బంగ్లాదేశ్‌లో ఈ అల్లర్లు సృష్టించాడట. ఇలా చేస్తే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూలిపోయి తన పార్టీ అధికారంలోకి వస్తుందని పన్నాగం పన్నినట్లు ఇంటెల్ రిపోర్ట్ చెప్తోంది.
ఈ అల్లర్లకు సంబంధించిన బ్లూప్రింట్ లండన్‌లోనే ప్రిపేర్ అయ్యిందట. తారీఖ్ రెహ్మాన్ సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడ ఉంటున్న ఐఎస్ఐ అధికారులను కలిసి ప్లాన్ వేసాడు. ప్లాన్ ప్రకారం సోషల్ మీడియాలో పాకిస్థాన్ నుంచి యాంటీ బాంగ్లాదేశ్ పోస్ట్‌లు పెట్టించి ఆ దేశ యువతను రెచ్చగొట్టేలా చేసారు. హసీనా ప్రభుత్వంపై మొత్తం 500 ట్వీట్లు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పాకిస్థాన్‌కు ముందు నుంచీ మద్దతుగా నిలుస్తోంది. దాంతో ఖలీదా జియాకు ఆమె కుమారుడికి ఏం కావాలన్నా పాకిస్థాన్ చేసిపెడుతుంది. ఈ అల్లర్లలో చైనా కూడా ఐఎస్ఐ సాయంతో కీలక పాత్ర పోషించింది.
విద్యార్థుల ద్వారా దాడులు చేయించి
జమాత్ ఎ ఇస్లామీ బంగ్లాదేశ్‌కి చెందిన విద్యార్ధుల సంఘం ICS (ఇస్లామీ ఛాత్రా షిబిర్) ఈ అల్లర్లను సాకుగా పెట్టుకుని హసీనా ప్రవేశపెట్టిన కోటా బిల్లుపై ఆందోళన కాస్తా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనగా మార్చింది. ICSకు పాకిస్థాన్ నుంచి చైనాకు చెందిన కొన్ని సంస్థలు ఫండ్స్ ఇస్తున్నట్లు సమాచారం. ఈ అల్లర్ల నేపథ్యంలో చోటుచేసుకున్న మరో ఆసక్తికరమైన సంఘటన ఏంటంటే.. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ సహబుద్దిన్ హసీనా ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడంతో పాటు ఓ కేసులో అరెస్ట్ అయిన ఖలీదా జియాను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసారు. (Turkey)