Prostate Cancer: ఈ మధ్యకాలంలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలని.. పలు రకాల క్యాన్సర్లపై అవగాహన పెంచుతూ మరణ శాతాన్ని తగ్గించేందుకు వారి కృషి వారు చేస్తున్నారు. కానీ ఈ క్యాన్సర్ అనే మహమ్మారి కొన్ని సార్లు వైద్యులను కూడా కన్‌ఫ్యూజ్ చేస్తుంటుంది. ఈ క్యాన్సర్‌తో వచ్చే చావే ఇది. శరీరంలోని ఏ అవయవంలో అయినా పుండు లాగా ఉన్నప్పుడు వెంటనే లక్షణాలు బయటపడవు. తీరా అది పెరిగి శరీరమంతా వ్యాపించేసాక అప్పుడు మనిషికి నొప్పి వంటివి కలిగి వైద్యుల దగ్గరకు పరిగెడతాడు. అయితే.. పంటి నొప్పని వెళ్లిన ఓ వృద్ధుడి విషయంలో మాత్రం వైద్యులు షాక్ అయ్యారు. ఎందుకంటే వారు కూడా పంటి నొప్పి అని పొరబడ్డారు. కానీ అది పంటి నొప్పి కాదు.. ప్రోస్టేట్ క్యాన్సర్. ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్లు ఎంత సర్వసాధారణమో.. మగవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్లు అంత కామన్.
ఇంతకీ ఈ పెద్దాయన కేసు ఏంటంటే.. పంటి నొప్పిగా ఉందని డెంటిస్ట్ వద్దకు వెళ్లగా.. అతను ఏ పన్ను దగ్గరైతే నొప్పి ఉందో వెంటనే దానిని తొలగించేసాడు. దాంతో ఆ పేషెంట్ హమ్మయ్య అనుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఎక్కడైతే పన్ను పీకారో అక్కడ గడ్డలా వాచిపోయింది. సాధారణంగా పన్ను పీకిన సమయంలో కాస్త వాపు ఉండటం సహజం. కానీ రోజులు గడుస్తున్నా ఆ వాపు తగ్గకుండా విపరీతంగా నొప్పి పెట్టడంతో మళ్లీ డాక్టర్ వద్దకు పరిగెత్తాడు. (Prostate Cancer)
మళ్లీ ఎందుకొచ్చాడబ్బా అని ఆ వైద్యుడు కూడా కన్‌ఫ్యూజ్ అయ్యాడు. పన్ను పీకినా నొప్పి మాత్రం తగ్గలేదని.. పైగా వాపు వచ్చిందని చెప్పడంతో ఆ వైద్యుడు వెంటనే సీటీ స్కాన్ తీసాడు. అప్పుడు అసలు విషయం బయటపడింది. అక్కడ పన్ను వాపు సమస్య కాదు. దవడ దగ్గర పుండు ఏర్పడింది. దానిని బయాప్సీ చేయగా.. ప్రోస్టేట్ క్యాన్సర్ అని తేలింది. సాధారణంగా ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది మగవారికి మూత్రాశయం అడుగు భాగంలో ఉంటుంది. క్యాన్సర్ వస్తే ఎక్కువగా అక్కడే రావాలి. కానీ అది పంటి దగ్గర రావడం ఏంటబ్బా అని ఆ వైద్యుడు షాక్ అయ్యాడు. తాను డెంటిస్ట్ కావడంతో వెంటనే ఆ పేషంట్‌ను ఆన్‌కాలజిస్ట్ వద్దకు పంపాడు. వారు గంట సేపు పరీక్షలు చేసిన తర్వాత.. ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ మెటాస్ట్సైజ్ అయ్యిందని చెప్పారు.
అంటే.. మూత్రాశయంలో ఆల్రెడీ ప్రోస్టేట్ క్యాన్సర్ రావడం.. అది శరీరంలోని అన్ని భాగాలకు వ్యాపించడం జరిగింది. పైగా పంటి భాగంలో బోన్ మ్యారో భాగం కాస్త ఎక్కువగా ఉండటం.. దవడల దగ్గర రక్తప్రసరణ బాగా జరగడం వల్ల క్యాన్సర్ అక్కడికెళ్లి కూర్చుందట. ఇలాంటి చాలా అరుదుగా జరుగుతుంటాయని.. అందుకే ప్రతి ఆరు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలని అంటున్నారు. ఇక ఆ పేషంట్‌కి వెంటనే చికిత్స మొదలుపెట్టారు. కానీ ఆయన వయసు ఎక్కువగా ఉండటం.. క్యాన్సర్ ఆల్రెడీ శరీరంలోని దాదాపు అన్ని భాగాలకు వ్యాపించడంతో మరో ఏడాది వరకు బతుకుతారని వైద్యలు తెలిపారు. (Prostate Cancer)