Breast Milk Production బిడ్డ పుట్టిన తర్వాత తల్లులు ఆరు నెలల పాటు వారికి చనుబాలు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని అంటుంటారు.
ఇప్పుడున్న జనరేషన్‌లో తల్లులకు అసలు చనుబాలే రావడం లేదంటే నమ్ముతారా? ఇందుకు కారణాలు చాలానే ఉన్నప్పటికీ ప్రధానంగా జీవనశైలి, తీసుకునే ఆహారమనే చెప్తారు వైద్యులు కూడా.
మరి చనుబాలు రావాలంటే బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? చనుబాలు బాగా రావాలంటే దానికి అవసరమయ్యే ఆహారాన్ని గలాక్టగోగ్స్ అంటారు.
డెలివరీ అయ్యాక తొలి 40 రోజుల పాటు ఈ గలాక్టగోగ్స్ ఆహారాన్నే బాలింతలకు తరతరాలుగా పెడుతూ వస్తున్నారు.
అజ్వైన్
డెలివరీ అయిన తొలి పది రోజుల పాటు తీసుకుంటే రికవర్ అవుతారు. యోని భాగంలో నొప్పి తగ్గుతుంది.
ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. నీటి నిల్వ కూడా ఉండదు. నెయ్యి లేదా బెల్లంలో వీటిని యాడ్ చేసుకుని తింటే ఎంతో మంచిది.
గోంద్
గోంద్ కటీరా, లడ్డూలు అని దొరుకుతాయి. డెలివరీ తర్వాత ఎముకలు చాలా వీక్ అయిపోతాయి. ఈ గోంద్‌తో మళ్లీ బలంగా మారుతాయి. శక్తి పెరుగుతుంది. పోషకాలు సమృద్ధిగా అందుతాయి. ఒకసారి తిని చూడండి. మార్పు మీకే తెలుస్తుంది.
మెంతులు
చనుబాలు ఏర్పడతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. పొడిగా చేసుకుని ఆహారంలో ఒక స్పూన్ వేసుకుని తింటే సరిపోతుంది.
అన్నింటికంటే ముఖ్యమైనది.. ఒత్తిడిని తగ్గించుకోండి. ఒత్తిడి ఉంటే చనుబాలు బ్లాక్ అయిపోతాయి. ప్రశాంతంగా ఉండాలి.
ఎన్ని రకాల ఆరోగ్యమైన ఫుడ్స్ తింటున్నా ఒత్తిడి ఉంటే మాత్రం ఆ ఆహారం శరీరం గ్రహించుకోలేదు.





