Thandel Pre Release Event: అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో దాదాపు 7 ఎకరాల్లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసారట. ఈ వేడుకకు సుమ యాంకరింగ్ చేసారు. అయితే.. సుమ నాగచైతన్యను ఆటపట్టిస్తూ.. మీరు మీ భార్య శోభితకు ఒక పాటను డెడికేట్ చేయాలనుకుంటే ఏ పాటను డెడికేట్ చేస్తారు అని అడిగారు. దీనికి నాగచైతన్య సమాధానం ఇస్తూ.. బుజ్జి తల్లి పాటను డెడికేట్ చేస్తాను అన్నారు.
శోభితను ఇంట్లో కూడా బుజ్జి తల్లి అనే పిలుస్తున్నట్లు చెప్తూ తెగ సిగ్గు పడిపోయారు. దాంతో ఫ్యాన్స్ తెగ కేకలు వేసారు. ఈ వేడుకకు అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్‌గా రావాల్సి ఉంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించడంతో.. నిర్మాత అల్లు అరవింద్ ఈవెంట్‌కు వచ్చారు. అయితే.. చాలా మంది అల్లు అర్జున్ కోసమే ఈ ఈవెంట్‌కి వచ్చినట్లు తెలుస్తోంది. వారందరికీ చివరి నిమిషంలో షాకింగ్ విషయాన్ని చెప్పారు. ఈవెంట్‌కు అల్లు అర్జున్ రాలేకపోతున్నారనే టాక్ రావడంతో ఈవెంట్‌కి వచ్చిన వారిలో చాలా మంది నిరుత్సాహంతో తిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం.
Thandel Pre Release Event: పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద ఓ మహిళ తొక్కిసలాటలో చనిపోయినప్పటి నుంచి అల్లు అర్జున్ ఎలాంటి ఈవెంట్లకు వెళ్లకూడదు అనుకున్నారట. కానీ సొంత బ్యానెర్‌లో రాబోతున్న తండేల్ సినిమాకు గెస్ట్‌గా రావాలని కోరగా ముందు వస్తానని బన్నీ చెప్పారట. ఆ తర్వాత ఆయన తన లాయర్లతో చర్చించి వెళ్లకపోవడమే మంచిది అని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
చందూ మొండేటి దర్శకత్వం వహించిన తండేల్ సినిమా ఈ నెల 7న రిలీజ్ కాబోతోంది. దాదాపు రూ.100 కోట్లతో ఈ సినిమాను తీసారట. నాగ చైతన్య కెరీర్‌లోనే ఇది అతి పెద్ద సినిమా అని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం సాయి పల్లవి దాదాపు రూ.5 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారట.