Taliban Rejects Trump: అగ్రరాజ్యం అమెరికాకు మరోసారి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధ్యక్షుడు అయిపోయాడు. ఈరోజు ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసారు. అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడైతే వచ్చే కిక్కు వేరొకరు అయితే రాదు. ఎందుకంటే ట్రంప్ అమెరికన్ల కోసం తీసుకునే నిర్ణయాలు మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసాక ట్రంప్ పలు కీలక అంశాలను ప్రకటించారు. వాటిలో అఫ్ఘానిస్థాన్‌లో రాజ్యం ఏలుతున్న తాలిబన్లకు ఓ వార్నింగ్ కూడా ఉంది.
2021లో అఫ్ఘాన్ ప్రభుత్వాన్ని తాలిబన్లు ఆక్రమించుకుని ఇప్పుడు వారే రాజ్యం ఏలుతున్నారు. అఫ్ఘాన్ పౌరులు తాము చెప్పినట్లే నడుచుకోవాలని కఠిన ఆంక్షలు పెట్టారు. తాలిబన్లు అఫ్ఘాన్‌ని ఆక్రమించుకున్న సమయంలో అక్కడ జరిగిన యుద్ధంలో చాలా మంది అమెరికా సైనికులు మృత్యువాతపడ్డారు. ఈ విషయంలో ట్రంప్ కన్నెర్రజేసారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కనీసం చనిపోయిన అమెరికా సైనికులకు సరైన నివాళి అర్పించలేదని.. వారి కుటుంబాలను ఆదుకోకపోగా ఎవ్వరూ చనిపోలేదని అబద్ధాలు ఆడారని మండిపడ్డారు. ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కాబట్టి అఫ్ఘాన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. (Taliban Rejects Trump)
అదేంటంటే.. తాలిబన్లతో యుద్ధం చేస్తున్న అమెరికా సైన్యాన్ని వెనక్కి రప్పించేసుకున్నారు కానీ అక్కడ అమెరికాకు చెందిన 7 బిలియన్ డాలర్ల ఆయుధాలను వదిలేసారు. ముందు ప్రాణాలు తర్వాత ఆయుధాలు అని ఆలోచించారు. ఇప్పుడు ఆ ఆయుధాలను వెనక్కి ఇచ్చేయాలని ట్రంప్ ఆదేశించారు. ఒకవేళ అఫ్ఘాన్ ఆ ఆయుధాలన్నీ వెనక్కి ఇచ్చేస్తే.. అమెరికా నుంచి అందాల్సిన ఆర్థిక సాయంలో ఏ లోటూ ఉండదని ట్రంప్ ఆఫర్ ఇచ్చారు. కానీ తాలిబన్లు ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేసారు. (Taliban Rejects Trump)
ఎందుకంటే తాలిబన్లు ఐసిస్‌ని పూర్తిగా నిర్మూలించేసి తామే నెంబర్ వన్ గ్రూప్‌గా ఉండాలని అనుకుంటున్నారు. ఇందుకోసం అమెరికా వదిలేసి పోయిన ఆయుధాలు బాగా పనికొస్తాయి. దాంతో తాము ఆ ఆయుధాలను వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదని తాలిబన్ సంస్థ ప్రజా ప్రతినిధి వెల్లడించాడు. అంతేకాదు.. ఆ ఆయుధాలు ఇవ్వకపోగా అమెరికాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సందర్భంగా మళ్లీ కొత్త రిలేషన్స్ మొదలుపెడదామని.. తమకు అందాల్సిన 9 బిలియన్ డాలర్ల ఫారిన్ ఎక్స్‌చేంజ్ నిధులను విడుదల చేయాలని తాలిబన్ కోరింది. తాలిబన్ అనేది ఒక అంతర్జాతీయ గ్రూప్‌గా పేరొందాలని.. ఇందుకోసం అమెరికా సాయం కావాలని కోరింది. దీనికి ట్రంప్ చచ్చినా ఒప్పుకోడు. 20 ఏళ్లుగా అఫ్ఘాన్‌లో ఉండిపోయిన ఆయుధాలు వెనక్కి ఇస్తే తప్ప ట్రంప్ ఆ దేశానికి సాయం చేయాలా వద్దా అనేది ఆలోచిస్తారు. (Taliban Rejects Trump)