Surya Kumar Yadav: తిలక్ వర్మ పుణ్యమా అని మన టీమిండియా తొమ్మిదో ఆసియా కప్ (Asia Cup 2025) కైవసం చేసుకుంది. వెక్కిలి చేష్టలు పిల్ల యవ్వారాలు చేసిన పాకిస్థాన్ క్రికెట్ టీంకు తమ స్థాయిని మరోసారి రుచి చూపిస్తూ నిన్న జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో మనోళ్లు అదరగొట్టేసారు. దీనిపై ఆసియా కప్ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో పాక్‌పై గెలవాలని రాసిపెట్టుందని అందుకే గెలిచామని అన్నారు.
మ్యాచ్‌కి ముందు .. మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఒక హార్ట్ బీట్ మానిటర్ ఉండి ఉంటే తన గుండె 150కి పైగా కొట్టుకున్నట్లు కనిపించేదని.. తన టీం నుంచి ఏదైనా కోరుకున్నానో అదే చేసి నిరూపించినందుకు గర్వంగా ఉందని అన్నాడు. టీమిండియా ఇంకా ఆసియా కప్ అందుకోలేదని.. కానీ భారత్ జరుపుకుంటున్న సంబరాల ముందు ఆ కప్ చేతికి రావడం పెద్ద మ్యాటర్ కాదని తెలిపాడు.