Akhanda 2: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా యావరేజ్ టాక్ అందుకుంది. బోయపాటి శ్రీనివాస్ మాస్ ఎలివేషన్స్, లాజిక్ లేని సన్నివేశాలు సినిమాను ముంచేసాయి. అఖండ 2 విషయంలో ఏదన్నా హిట్ అయ్యింది అంటే.. అది బోయపాటి, బాలయ్య కలిసి హిందీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ మాత్రమే. ఆల్రెడీ కాషన్ కియా అంటూ బోయ చెప్పిన డైలాగ్‌కు సోషల్ మీడియా మీమ్స్‌తో నిండిపోయింది. సరే.. ఈ సంగతి పక్కన పెడితే.. అఖండ 2 సినిమాలో కీలక పాత్ర ఏదన్నా ఉందంటే అది జనని. ఈ పాత్రను బాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా నటించింది.
బజరంగీ భాయ్‌జాన్ సినిమాలో హర్షాలీ మున్నీ పాత్రకు విపరీతమైన ఫేమ్ వచ్చేసింది. అప్పుడు చిన్న పిల్ల ముద్దుగా ఉంది కాబట్టి ఏదో వర్కవుట్ అయ్యింది. నిజానికి ఆ అమ్మాయికి నటన రాదు. డైలాగ్ డెలివరీ అంతకన్నా రాదు. అలాంటి అమ్మాయికి కీలక పాత్ర ఇచ్చారు. అయితే.. ఈ పాత్ర కోసం ముందు సూపర్‌స్టార్ మహేష్ బాబు కూతురు సితారను అనుకున్నారట. అంతేకాదు.. ప్రముఖ తమిళ నటుడు సూర్య కూతురు దియాను కూడా అనుకున్నారట. చివరికి హర్షాలీ మల్హోత్రను తీసుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు, సూర్య అభిమానులు హమ్మయ్య.. ఆ ఇద్దరు అమ్మాయిలు తప్పించుకున్నార్రా బాబూ.. బహుశా వీరికి IQ 220 లేదేమో అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.





