Shattila Ekadashi: పుష్య మాసంలో వచ్చే ఒక ప్రత్యేకమైన ఏకాదశిని షట్తిల ఏకాదశి అంటారు. 2025 సంవత్సరంలో జనవరి 25న ఈ షట్తిల ఏకాదశి వచ్చింది. షట్తిల ఏకాదశి అంటే ఏంటంటే.. నువ్వులను ఆరు రకాలుగా ఉపయోగించే ఏకాదశి. హిందీలో నువ్వులను తిల్ అంటారు. ఆరోజున నువ్వులు ఆరు రకాలుగా వినియోగిస్తే ఎంతో మంచిది. దీని వల్ల జన్మజన్మల దరిద్రాలు తొలగిపోతాయి. జాతక దోషాల నుంచి బయటపడచ్చు. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది. కాబట్టి 2025 సంవత్సరం జనవరి 25 షట్తిల ఏకాదశి రోజున ఆరు రకాలుగా నువ్వులు ఎలా వినియోగించాలో తెలుసుకుందాం.
నువ్వుల పిండి శరీరానికి రాసుకుని స్నానం చేయాలి. ఆ తర్వాత మీరు స్నానం చేసే నీళ్లలో కాసిన్ని నువ్వులు కలుపుకుని ఆ నీళ్లతో స్నానం చేయాలి. స్నానం చేసాక ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో కొన్ని నువ్వులు కలిపి ఆ నీళ్లు తాగాలి. నాలుగోది.. మీరు తినే ఆహార పదార్థాల్లో నువ్వులు ఉండేలా చూసుకోవాలి. ఐదోది.. నువ్వులు ఎవరికైనా దానం ఇవ్వాలి. దేవాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటి దగ్గర కానీ పంతులుకి నువ్వులు దానం ఇచ్చి కాస్త దక్షిణ ఇవ్వండి. ఒకవేళ పంతుళ్లు దొరకపోతే నువ్వులతో చేసిన లడ్డూలను దగ్గర్లో ఎవరికైనా పంచి పెట్టాలి. ఇక ఆరోది ఏంటంటే.. నువ్వులతో దైవాన్ని పూజించాలి. శివుడి ఫోటోకి కానీ శివలింగం కానీ ఉంటే నువ్వులతో శివుడికి పూజ చేసి ఆ పూజ పూర్తయ్యాక ఆ నువ్వులను గోవుకి తినిపించాలి. ఒకవేళ శివలింగం ఉంటే నువ్వులు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో అభిషేకం చేయచ్చు. లేదా నువ్వులను ఆవు పాలలో కలిపి అవి కూడా వాడచ్చు. అంటే నువ్వులతో శివుడిని పూజించడం ముఖ్యం. (Shattila Ekadashi)
ఇలా ఆరు రకాలుగా నువ్వులను ఎవరైతే జనవరి 25న ఉపయోగిస్తారో.. ఆ రోజు నుంచి వాళ్లకు ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి. విశేషమైన ఐశ్వర్యం కలుగుతుంది. గ్రహాలన్నీ మీకు అనుకూలిస్తాయి. అనుకున్న పనులు అన్నీ పూర్తవుతాయి. అఖండ ధన లాభం కలుగుతుంది. అలాగే.. కుటుంబ కలహాలన్నీ పోవాలంటే కూడా షట్తిల ఏకాదశి రోజున ప్రత్యేకమైన పరిహారం చేసుకోవాలి. జనవరి 25 రాత్రి పూట నిద్రపోయే ముందు ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో కాసిన్ని నల్ల నువ్వులు కలిపి కొద్దిగా కర్పూరం వేసి మీ తల దగ్గర ఆ రాగి చెంబు ఉంచి నిద్రపోండి. మర్నాడు ఉదయం ఆ రాగి చెంబులో నీళ్లు ఎక్కడైనా చెట్టులో పోయండి. దీని వల్ల క్రమక్రమంగా కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. అందరూ ఒకళ్లనొకరు అర్థంచేసుకుంటారు. మీ ఇంటికి భయంకరమైన దిష్టి ఉంటే ఒక ఎర్ర వస్త్రం తీసుకుని కాసిన్ని నల్ల నువ్వులు వేసి పసుపు కుంకుమ వేసి ఆ ఎర్ర వస్త్రాన్ని మూట కట్టి ఆ మూటతో మీ ఇంటి మూడు సార్లు క్లాక్ వైస్, మూడు సార్లు యాంటీ క్లాక్ వైస్ దిష్టి తీసి ఎవ్వరూ తొక్కని చోట పడేయండి. దీని వల్ల ఎలాంటి దిష్టి ఉన్నా పోతుంది. ఫలితాలు మీరే చూస్తారు. (Shattila Ekadashi)