Shani Effect: శని భగవానుడు అనగానే అందరూ వణికిపోతారు. ఆయన్ను నెగిటివ్‌గా చూస్తారు. కానీ శనీశ్వరుడిని మించిన శక్తి మరొకటి ఉండదు. ఎందుకంటే ఆయనకు మనపై పర్సనల్ కోపాలు, ద్వేషాలు ఏమీ ఉండవు. మనం చేసుకన్న కర్మలకు తగ్గట్టు ఫలితాలను ఇస్తారు. 2026లో శని మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీని వల్ల కొన్ని రాశులకు గడ్డు కాలం మరికొన్ని రాశులకు గోల్డెన్ పీరియడ్ ఉండబోతోంది. అవేంటో తెలుసుకుందాం.
వృషభ, తులా, మీనం
ఈ మూడు రాశులకు గోల్డెన్ పీరియడ్. అభివృద్ధికి సంబంధించిన అవకాశాలు బోలెడు ఉంటాయి. కానీ వాటిని అందుకునే క్రమంలో కష్టాలు ఉంటాయి. హడావిడిగా తీసుకునే నిర్ణయాలు బెడిసికొడతాయి. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో కాకుండా ప్రాపర్ ప్లానింగ్ చేసుకుని ముందుకెళ్తే అంతా బాగానే ఉంటుంది.
మేష, సింహ, ధనుస్సు
ఈ రాశులకు గడ్డు కాలమనే చెప్పాలి. బాధ్యతలు పెరిగిపోతాయి. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కష్టపడినా ఆ ఫలితాలను చూసేందుకు సమయం పడుతుంది. మీ కెరీర్, ఓపిక, నిర్ణయం తీసుకునే విధానానికి ఇది పరీక్షా కాలం అనుకోవాలి. వీలైనంత తక్కువగా మాట్లాడండి. మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లండి.
మరి దీనికి పరిహారాలు ఏమీ లేవా అంటే.. రోజూ హనుమాన్ చాలీసా చదివితే శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.





