Sanjay Dutt: బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1993 ముంబైలో పేలుళ్లు జరిగిన సమయంలో సంజయ్ దత్ అక్రమ ఆయుధాలను తన ఇంట్లో పెట్టుకున్నారంటూ ఆయన్ని అరెస్ట్ చేసారు. చాలా కాలం పాటు జైలు శిక్ష అనుభవించి ఏడేళ్ల క్రితం సంజయ్ బయటపడ్డారు. అయితే.. 1987లో సంజయ్ అగ్ర హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో రిచా శర్మ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
రిచా సంజయ్‌ను పెళ్లి చేసుకోవడానికి న్యూయార్క్‌లో ఉన్న తన తల్లిదండ్రులను ఒప్పించేందుకు ఓ చిన్నపాటి యుద్ధమే చేసారు. ఎట్టకేలకు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి త్రిషాలా అనే కూతురు కూడా ఉంది. 1993లో రిచా శర్మకు బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసింది. అదే సమయంలో సంజయ్ దత్ అక్రమ ఆయుధాలు కలిగున్న కేసులో అరెస్ట్ అయ్యారు. దాంతో త్రిషాలాను న్యూయార్క్‌లో ఉంచాల్సి వచ్చింది. రిచా కూడా తన క్యాన్సర్ చికిత్స నిమిత్తం న్యూయార్క్ వెళ్లిపోయింది. అయితే.. ఓసారి సంజయ్ దత్ బెయిల్‌పై బయటికి వచ్చి నేరుగా న్యూయార్క్ వెళ్లారు. అప్పటికే రిచా శర్మ చావు బతుకుల మధ్య ఉన్నారు.
తన బిడ్డ త్రిషాలాను చూసి సంజయ్ ఎలా ఉన్నావ్ అని అడగ్గా.. బానే ఉన్నాను అంకుల్ అందట. దాంతో ఆయన గుండె పగిలిపోయింది. తండ్రి జైల్లో ఉంటే కనీసం తన గురించి బిడ్డకు సరిగ్గా చెప్పాల్సిన బాధ్యత కూడా రిచా తీసుకోలేదని మండిపడ్డారట. తండ్రి దూరంగా ఉన్న మాత్రాన ఆయన జ్ఞాపకాలను బిడ్డలకు పంచాల్సిన బాధ్యత తల్లిదే కదా అంటూ ఓ ఇంటర్వ్యూలో సంజయ్ తన మాజీ భార్యపై ఆగ్రహం వ్యక్తం చేసారు. రిచా శర్మ చనిపోయాక సంజయ్ మరో పెళ్లి చేసుకున్నారు.