Search The Query
Search

Image
  • Home
  • Politics
  • Revanth Reddy: మీ మంత్రిని జ‌ర చూస్కోండి.. చంద్ర‌బాబుతో రేవంత్

Revanth Reddy: మీ మంత్రిని జ‌ర చూస్కోండి.. చంద్ర‌బాబుతో రేవంత్

Revanth Reddy: ఆయ‌న తొలిసారి మంత్రి.. బాగా కీల‌క‌మైన ప‌ద‌వి.. ఈ ప‌ద‌విని ఆయ‌న‌కు క‌ట్ట‌బెట్టిన‌ప్పుడే పొరుగు రాష్ట్రం తెలంగాణ‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగాయి. ఆయ‌న‌కు ఆ పోర్ట్‌ఫోలియో ఇచ్చారా? చంద్ర‌బాబు నాయుడుకు (Chandrababu Naidu) అన్నీ తెలిసే ఈ నిర్ణ‌యం తీసుకున్నారా? ఆయ‌న ఇక్క‌డ ఏం ప‌నులు చేస్తారో తెలిసే ఆయ‌న్ను కేబినెట్లోకి తీసుకున్నారా? అని తెలంగాణ‌లోని ప్ర‌భుత్వం పెద్ద‌లు.. రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఆ త‌ర్వాత ఇవే చ‌ర్చ‌లు చంద్ర‌బాబుకు చేరాయి. కానీ అప్ప‌టికే ఆయ‌న‌కు ప‌ద‌వి ఇచ్చేయ‌డంతో చంద్ర‌బాబు ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. ఫిర్యాదులు ఉన్నాయి.

ఆయ‌న‌కో షాడో మంత్రి

ప‌నితీరులో మంచి ఫ‌లితాల‌తో ముంద‌డుగు వేయాల‌ని.. బాబు సూచ‌న చేసిన‌ట్లు తెలిసింది. అధినేత సూచ‌న‌ల‌ను ఆ చెవితో విని ఈ చెవితో వ‌దిలేసిన‌ట్లుంది ఆ “డార్లింగ్” మంత్రి తీరు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం వారంలో రెండు రోజులు నియోజ‌క‌వ‌ర్గం.. రెండు రోజులు అమ‌రావ‌తి.. మ‌రో మూడు రోజులు హైద‌రాబాద్‌లో మ‌కాం. ఇదీ స‌ద‌రు మంత్రి గారి దిన‌చ‌ర్య‌.శుక్ర‌వారం నుంచే ఆయ‌న హైద‌రాబాద్‌లోని ఓ ప్ర‌ముఖ స్టార్ హోట‌ల్‌లో దిగిపోతారు. మంత్రికి ఆల్ ఇన్ వ‌న్‌గా ఒక‌డు ఉన్నాడు. ఆయ‌న షాడో మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఫైళ్ల మీద సంత‌కాలు పెట్ట‌రు కానీ మిగిలిన వ్య‌వ‌హారాల‌న్నీ ఆయ‌నే చ‌క్క‌దిద్దుతారు. శుక్ర‌వారం వ‌చ్చిందంటే చాలు.. ఆ మంత్రి.. మ‌రో ఆల్ ఇన్ వ‌న్ హైద‌రాబాద్‌లో తేలతారు. ఓ స్టార్ హోట‌ల్‌లో బ‌స చేస్తారు. నాలుగు రూంలు బుక్ చేస్తారు. ఆంధ్ర‌ప్రదేశ్‌లో ఆ మంత్రితో ప‌నులు ఉన్న‌వారు కీల‌క వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టాల్సిన వారు ఆ హోట‌ల్‌లో బారులు తీర‌తారు.

ఇప్పుడిప్పుడు తెలంగాణ‌లోని భూ వ్య‌వ‌హారాల్లోనూ స‌ద‌రు మంత్రి వేలుపెడుతున్న‌ట్లు చ‌ర్చ న‌డుస్తోంది. ఏమైనా.. ఇదంతా ఆ మూడు రోజులు పెద్ద జాత‌ర‌లా సాగుతుంది. ఒక రూంలో పంచాయ‌తీలు, ప‌రిష్కారాలు, సెటిల్‌మెంట్లు.. ఇవ‌న్నీ మంత్రి ఆల్ ఇన్ వ‌న్ చూస్తుంటారు. మ‌రో రూంలో మంత్రి ద‌ర్జాగా విలాసాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు విజిట‌ర్స్, సెటిల్‌మెంట్ కోసం వ‌చ్చిన‌వారిని అనుమ‌తిస్తుంటారు. సాయంత్రం నుంచి ఆదివారం అర్థ‌రాత్రి వ‌ర‌కు గానా బ‌జానా క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో హోరెత్తిస్తుంటారు.  (Revanth Reddy)

తెలంగాణ ప్ర‌భుత్వం నిఘా

నిజానికి మంత్రి కాక ముందే ఓ సాధార‌ణ ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో ఇదే జోరు ఉండేది. మంత్రి అయ్యాక బుక్ చేసే గ‌దుల సంఖ్య పెరిగింది. ఆయ‌న కోసం వ‌చ్చే విజిట‌ర్లు అద‌నం. హైద‌రాబాద్‌లో ఆ మంత్రికి రియ‌ల్ ఎస్టేట్ ఇత‌ర వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అదే స‌మ‌యంలో ఏపీలోనూ ప‌లు వ్యాపారాలు ఉన్నాయి. ఆయ‌న హైద‌రాబాద్‌లో కాలు పెట్టారంటే బ్యాచ్‌కు పండ‌గే. ఇది రాను రాను ఓ పెద్ద అంశంగా మారిపోయింది. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా ఈయ‌న‌పై దృష్టి పెట్టేంత‌గా వెళ్లింది. అంత‌కుముందు ఆయ‌న హోట‌ల్‌లో దిగితే ఏం చేస్తారో తెలుసు. కానీ ఏపీలో మంత్రి అయ్యాక హైద‌రాబాద్ కేంద్రంగా ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు ప్ర‌త్యేకంగా దృష్టిసారించారు. గ‌త ఆరు నెల‌లుగా ఆ మంత్రి ఆయ‌న ఆల్ ఇన్ వ‌న్ ఎక్క‌డా త‌గ్గ‌కుండా వీకెండ్ జోరుతో పాటు హైద‌రాబాద్ కేంద్రంగా వ్య‌వ‌హారాలు అనేకం చ‌క్క‌బెడుతున్న స‌మాచారం ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు పక్కా ఆధారాల‌తో చేరింది. దీంతో మ‌రో అడుగు ముందుకేసి పూర్తి స్థాయి నిఘా పెట్టారు. అప్పుడే.. విస్మ‌యానికి గురిచేసే అంశాలు వారి దృష్టికి వెళ్లాయి.

మీవోడ్ని జ‌ర కంట్రోల్‌లో పెట్టుకోండి

ఇక లాభం లేద‌నుకుని ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సీఎం చంద్ర‌బాబుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఓ లిఖిత‌పూర్వ‌క స‌మాచారం అందించింది. దాంతో పాటు మౌఖిక సూచ‌న‌ల‌తో ఓ కాల్ చేసిన‌ట్లు స‌మాచారం. ఆ మంత్రి సాధార‌ణ ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు ఏం చేసారు.. మంత్రి అయ్యాక ఏం చేస్తున్నార‌నేది ఆ లేఖ‌లో స‌వివ‌రంగా పేర్కొన్న‌ట్లు తెలిసింది. మీ మంత్రిని జ‌ర చూస్కోండి. ఆయ‌న ఇక్క‌డ చేస్తున్న ప‌నులు ఏమీ బాగోలేవు. తెలంగాణ భూముల వ్య‌వ‌హారాల్లో వేళ్లు పెడుతున్నాడు. మీరు అత‌న్ని కంట్రోల్‌లో పెట్టుకోండి. మేం పెట్టాల్సి వ‌స్తే ట్రీట్మెంట్ అదోలా ఉంట‌ది. ఆ ప‌నులేవో ఏపీలో చేస్కోమ‌నండి అని సూటిగా స్ప‌ష్టంగా అని వార్నింగ్ ఇచ్చార‌ట‌. (Revanth Reddy)

చంద్ర‌బాబు ఆరా

ఆ త‌ర్వాత ఆ మంత్రి లీల‌లు, ప‌నితీరుపై చంద్ర‌బాబు నాయుడు పూర్తి నివేదిక తెప్పించుకున్నార‌ని తెలిసింది. ఈ సంద‌ర్భంగా ఆ మంత్రి పేషీల్లో ఆల్ ఇన్ వ‌న్ చేస్తున్న ప‌నులు వెలుగుజూసాయి. మంత్రికి స‌న్నిహితుడు.. వ్యాపార భాగ‌స్వామిగా ఉన్న వ్య‌క్తే ఆ శాఖ‌కు ఆల్ ఇన్ వ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని బ‌య‌టికి వ‌చ్చింది. మంత్రికి వ‌చ్చే కీల‌క ఫైళ్లు.. మంత్రి కోర్టు ప‌రిధిలోని అంశాల్లో ఆయ‌న వేలు పెట్ట‌డం.. ఇంకా ఏ నిర్ణ‌యాలు తీసుకోవాలో దిశా నిర్దేశం చేస్తున్నార‌ని గుర్తించారు. విజ‌య‌వాడ గురునాన‌క్ కాల‌నీలో మంత్రికి ప్రైవేట్ నివాసం ఉంది. దానికి కూత‌వేటు దూరంలో ఓ స్టార్ హోట‌ల్ ఉంది. అక్క‌డ మంత్రి ప‌రివారం చేసే కార్య‌క్ర‌మాలు వేరే లెవ‌ల్ అని ప్ర‌భుత్వం క‌నిపెట్టింది. అటు తెలంగాణ‌.. ఇటు ఏపీ ప్ర‌భుత్వ సొంత నివేదిక‌లు ఆ డార్లింగ్ మంత్రిని ప‌క్కాగా బుక్ చేసాయి. మంత్రి ప్ర‌భుత్వ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఎలా స్పందించ‌నున్నారు అన్న‌ది స‌హ‌చ‌ర మంత్రుల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. (Revanth Reddy)

More News

Jagan mohan reddy fires over salmon murder
దీనికేం స‌మాధానం చెప్తారు?
BySai KrishnaJan 16, 2026

Jagan గురజాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్యపై స్పందించారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, వైఎస్సార్ కాంగ్రె పార్టీ…

Narendra Modi enter his new office
కొత్త కార్యాల‌యంలోకి ప్ర‌ధాని.. స్వాతంత్ర్యం వ‌చ్చాక తొలిసారి
BySai KrishnaJan 12, 2026

Narendra Modi భార‌త ప్రధాని న‌రేంద్ర మోదీ కొత్త కార్యాల‌యంలోకి అడుగుపెట్ట‌నున్నారు. 1947లో మ‌న‌కు స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌ర్వాత నుంచి…

Telangana Municipal Elections TBJP says no alliance with Janasena
జ‌న‌సేన‌తో పొత్తు లేదు
BySai KrishnaJan 12, 2026

Telangana Municipal Elections తెలంగాణ‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న GHMC ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేస్తోంద‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ…

YSRCP Naga Malleswari strong warning to ABN radha krishna
“జ‌గ‌నన్న వ‌చ్చాక నీ ఛానెల్ ఎక్క‌డుంట‌దో నీ ఊహ‌కే వ‌దిలేస్తున్నా”
BySai KrishnaJan 12, 2026

YSRCP Naga Malleswari త‌మ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ‌చి తీర‌తార‌ని.. అప్పుడు ఛానెల్ ఎక్క‌డుంట‌దో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top