Rachamallu Siva Prasad Reddy మూడు పెళ్లిళ్లు చేసుకున్నోడూ సనాతన ధర్మం గురించి మాట్లాడటమే అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఫైర్ అయ్యారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రాచమల్లు శివప్రసాద్.
ఏ మతానికి సంబంధించి ఆ రకంగా వస్త్రం ధరించడం పవన్‌కి బాగా వచ్చని.. తిరుమల లడ్డూలో కొవ్వు కలిసిందని అబద్ధపు ప్రచారాలు చేసి వెంటనే దాని గురించి విషం చిమ్మేందుకు పిలక, నామం, పంచ కట్టుకుని వచ్చేస్తాడని.. ఇంకో మతం గురించి ఏదన్నా మాట్లాడాలంటే దానికి తగ్గట్టుగా వేషం మార్చే టైపని మండిపడ్డారు.
కేవలం తమ నాయకుడు జగన్‌ను టార్గెట్ చేసేందుకు శ్రీవారిని వాడేసుకుంటున్నారని వీళ్లసలు మనుషులేనా అని ఆగ్రహం వ్యక్తంచేసారు.





