Pawan Kalyan:ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాగా గడ్డి పెట్టారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan), కియారా అడ్వాణీ (Kiara Advani) నటించిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Game Changer Pre release Event) ఈరోజు రాజమండ్రిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఎవర్ని టార్గెట్ చేయాలో వారికి నవ్వుతూనే ఇచ్చిపడేసారు. అందులో మొదట వ్యక్తి రేవంత్ రెడ్డి (Revanth Reddy).
తెలంగాణలో పుష్ప 2 రిలీజ్ ఈవెంట్‌లో రేవతి అనే మహిళ దుర్మరణం చెందడంతో.. ఇది ఇండస్ట్రీ సమస్యగా చూపుతూ సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు ఇటీవల రేవంత్‌ను కలిసిన సంగతి తెలిసిందే. అయితే టాప్ నిర్మాతలు.. టియర్ 2 హీరోలు రేవంత్‌ను కలిసేందుకు వెళ్లడంతో ఆయన నిరుత్సాహపడ్డారట. నిర్మాతలు వచ్చినట్లుగానే.. టాప్ హీరోలు ఎందుకు రాలేదు అనే చర్చ జరిగినట్లు సమాచారం. ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి వాళ్లు రాకపోవడంతో ఆయన మనోభావాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. వెంకీ సినిమాలో జామకాయలు పల్లీలు తినేవాడిలా కనిపిస్తున్నానా.. జీడిపప్పు బాదం పప్పు కనిపించలేదా.. అని బ్రహ్మానందం రవితేజపై కేకలు వేసినట్లు.. చిన్న హీరోలతో మాట్లాడేవాడిలా కనిపిస్తున్నానా.. ఏ రామ్ చరణ్, ప్రభాస్‌లు రాలేరా అని రేవంత్ కాస్త హర్ట్ అయ్యారట. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి పేరు తీయకుండానే సెటైర్ వేసారు. (Pawan Kalyan)
హీరోలు దండం పెట్టాలా?
సినిమా టికెట్ల కోసం హీరోలు వెళ్లి సీఎంలకు ఎందుకు దండాలు పెట్టాలి? కావాలంటే నిర్మాతలతో మాట్లాడండి. హీరోలు వచ్చి నమస్కారం పెట్టాలి అనుకునేంత లోలెవెల్ వ్యక్తులం మేము కాదు. ఇది స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ గారి దగ్గర నుండి నేర్చుకున్నాం అని పవన్ కళ్యాణ్ నిక్కచ్చిగా చెప్పేసారు. ఆయన చెప్పినదాంట్లో కూడా అర్థం ఉంది. సినిమాకు సంబంధించిన కీలక అంశాలు మాట్లాడాల్సింది నిర్మాతలతోనే కదా..! మరి హీరోలు ఎందుకు రావాలి? హీరోలు వస్తేనే పని అవుతుంది అనుకుంటే అలాంటి ముఖ్యమంత్రికి ఎవ్వరూ గౌరవం ఇవ్వరు అని సినీ అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. (Pawan Kalyan)
అల్లు అర్జున్‌ని పొగుడుతూనే సెటైర్
ఇక్కడ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్‌కి (Allu Arjun) కూడా కాస్త బుద్ధి రావాలన్న ఉద్దేశంతో ఆయన గురించి ప్రస్తావించినట్లు అనిపిస్తోంది. గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కి వచ్చినవారిలో అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు అభిమానులు కూడా ఉన్నారని.. తామెప్పుడూ ఒక హీరో సినిమా మాత్రమే బాగా ఆడాలి.. మిగతావాళ్ల సినిమాలు ఫ్లాప్ అవ్వాలని కోరుకోలేదని.. ఇలాంటి బుద్ధి తమ ఇంటా వంటా లేదని అన్నారు. తన అన్న చిరంజీవి తమను అలా పెంచారని గుర్తుచేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు చేస్తూనే.. ఈరోజు తాను కానీ రామ్ చరణ్ కానీ ఇంతటి స్థాయిలో ఉన్నారంటే అందుకు కారణం చిరంజీవి అని తెలిపారు. కొంతకాలంగా అల్లు అర్జున్ మెగా కుటుంబాన్ని దూరంగా ఉంచుతూ.. అల్లు అర్జునే ఒక బ్రాండ్ అన్నట్లుగా క్రియేట్ చేసుకున్నారు. అందులో ఏమాత్రం తప్పు లేదు. కానీ మూలాలు మర్చిపోతే ఎలా? మనం ఎక్కడి నుంచి ఎవరి అండతో వచ్చామో కూడా గుర్తుంచుకోవాలి కదా. అందుకే పవన్ తన స్పీచ్ మొదలుపెట్టే సమయంలోనే మనం ఏ స్థాయిలో ఉన్నా మూలాలు మర్చిపోకూడదు అన్నారు. ఇది పరోక్షంగా అల్లు అర్జున్‌ని అన్నట్లే కదా..! (Pawan Kalyan)
దిల్ రాజుకి పడింది
ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజుపై (Dil Raju) పవన్ సెటైర్లు వేసారు. తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్న దిల్ రాజుని చూసి.. మీరు ఆంధ్రప్రదేశ్‌ను తక్కువ చేసి చూడకండి అనేసారు. దాంతో అక్కడున్నవారు షాకయ్యారు. ఆ తర్వాత దిల్ రాజు నాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కళ్లు లాంటివి అన్నారు. ఇందుకు పవన్ ఒప్పుకోలేదు. కళ్లు అవన్నీ నేను నమ్మను కానీ.. దయచేసి ఆంధ్రప్రదేశ్ వైపు కూడా కాస్త చూడండి. ఇక్కడి వారికి కూడా పని కల్పించండి అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పాపం దిల్ రాజు ముఖంలో బాధ కనిపిస్తున్నప్పటికీ.. ఏం చేయాలో తెలీక నవ్వుతూ సరే అన్నారు.
OG గురించి తర్వాత మాట్లాడుకుందాం
ఈ సందర్భంగా అభిమానులు OG OG అని కేకలు వేస్తున్నా.. పవన్ మాత్రం తన సినిమా గురించి మాట్లాడేందుకు ఒప్పుకోలేదు. గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కి వచ్చి మరో సినిమా గురించి మాట్లాడకూడదు అని అన్నారు. ముందు గేమ్ ఛేంజర్ సంగతి చూడాలని ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు తన సినిమాల గురించి మాట్లాడతానని తెలిపారు. తనకు తన సినిమాలంటే ప్రజల భవిష్యత్తే ముఖ్యం అని అన్నారు.