Panchagraha Yogam: 2026 జనవరిలో పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది. ఈ కూటమి వల్ల ఐదు రాశులకు శుభకాలం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఈ పంచ గ్రహ కూటమి మకరరాశిలో ఏర్పడబోతోంది. దీని వల్ల మకర రాశితో పాటు మరో నాలుగు రాశుల వారికి మంచి జరుగుతుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
మకర రాశి (Capricorn)
మకర రాశి అంటేనే నిబద్ధత, కష్టపడేతత్వం, బాధ్యతకు మారు పేరు. ఈ రాశి వారికి అన్నీ బెడిసికొట్టినట్లు అనిపిస్తుంటాయి కానీ ఓపికతో ఉంటే నెమ్మదిగా విజయం వరిస్తుంది.
వృషభ (Taurus)
ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. స్థిరంగా ఉంటూ ఎలాంటి తప్పుడు ఆలోచనలు, రిస్క్‌తో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే విజయం వరిస్తుంది.
మిథున (Gemini)
కెరీర్ విషయంలో మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా తీరని సమస్యలు నెమ్మదిగా ఓ కొలిక్కి వస్తుంటాయి. కొత్త బాధ్యతలు ఉంటాయి. కొత్తగా ఏమన్నా నేర్చుకోవడానికి, భవిష్యత్తు కార్యచరణపై దృష్టిసారించడానికి 2026 జనవరి కరెక్ట్ సమయం. ఆర్థికంగానూ నెమ్మదిగా కోలుకుంటారు.
సింహం (Leo)
కెరీర్‌లో అభివృద్ధి ఉంటుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంపల్సివ్ స్పెండింగ్ తగ్గించుకోవాలి. అంటే అప్పటికప్పుడు ఒక వస్తువు కొనేయాలి అనే మూడ్ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏదో ఒకటి చేసి అది కొనకుండా ఉండేందుకు ప్రయత్నించండి. లేదంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక సాయం అడిగేవారు ఉంటారు. సరే అని మాటిచ్చేయకండి. నో చెప్పడం నేర్చుకోండి. తప్పదు. తప్పులేదు.
తులా (Libra)
వ్యాపారాలు, పెట్టుబడుల బాగా సాగుతాయి. జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెరగకపోయినా బాధపడకండి. ఆర్థికంగా ఒక స్థాయిలో ఉంటారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అప్పుడే సరైన ఆలోచనలు వస్తాయి.





