Pakistan: పహల్గాం భీకర దాడి నేపథ్యంలో దాయాది పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు కేంద్రం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను దేశం వీడి వెళ్లిపోమంది. ఈ నేపథ్యంలో 17 ఏళ్లుగా వీసా గడువు ముగిసినా కూడా అక్రమంగా నివసిస్తున్న ఓ వృద్ధుడు బెంగతో గుండెపోటుతో మరణించాడు. 69 ఏళ్ల అబ్దుల్ వహీబ్ అనే వ్యక్తి 17 ఏళ్లుగా భారత్‌లోనే ఉంటున్నారు. ఇతని వీసా గడువు కూడా ముగిసిపోయింది. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో మకాం వేసాడు.
కేంద్ర ప్రభుత్వం నుంచి NORI (No Obligation to Return to India) సర్టిఫికేట్ కలిగిన పాకిస్థానీయులు దాదాపు 224 మంది అటారీ బార్డర్ నుంచి భారత్‌లోకి వచ్చారు. వీరిలో ఇప్పటివరకు 139 మంది మాత్రమే పాక్ వెళ్లిపోయారు. మిగతా వారి కోసం జల్లెడ పడుతుండగా అబ్దుల్ గురించి తెలిసింది. దాంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు అతన్ని పాక్‌కు డిపోర్టేషన్ చేసేందుకు శ్రీనగర్ నుంచి తీసుకెళ్లారు. అతను ఈరోజు వెళ్లిపోతాడనగా గుండెపోటుతో మృతిచెందాడు.