Pakistan President: పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి ఇంకా బుద్ధి వచ్చినట్లు లేదు. ఓ పక్క మే నెలలో భారత్ పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూనే ఏమీ భయపడనట్లు గాంభీర్యాలు పలుకుతున్నాడు. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో మిలిటరీ తనకు రక్షణ కల్పించేందుకు బంకర్‌లో దాక్కోమని చెప్పడం వాస్తవమని చెప్తూనే.. తాను భయపడి దాక్కునే వాడిని కానని.. నాయకుడంటే దాక్కునేవాడు కాదు ఎదురెళ్లి పోరాడి వీరమరణం పొందేవాడని అంటున్నాడు.
ఆపరేషన్ సింధూర్ ఘటన అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పాక్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇకనైనా కడుపు నిండా తింటూ.. ప్రశాంతమైన జీవితాన్ని గడపండి. లేదంటే గోలీ దించడమే అని అన్నారు. ఈ వార్నింగ్‌పై జర్దారీ ఓ బహిరంగ కార్యక్రమంలో స్పందిస్తూ.. గోలీ దిగడం పక్కా.. కాకపోతే అది మా నుంచే ఇండియాపై దిగుద్ది అనడం వైరల్‌గా మారింది.





