Pakistan: దాయాది దేశం పాకిస్థాన్ తీర్చాల్సిన అప్పు 130 బిలియన్ డాలర్లు. ఇప్పుడు పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) నుంచి పాక్ చాలా 1.3 బిలియన్ డాలర్లు అప్పుగా తీసుకుంది. పోనీ ఆ డబ్బుతో ప్రజలకు ఏదన్నా ఉపాది కల్పించడం.. దాని నుంచి GDPని అభివృద్ధి చేసుకోవడం వంటివి చేసిందా అంటే.. అది మానేసి భారత్‌పై కుట్రలు చేయడానికి ఉగ్రవాదులను పెంచి పోషించడంపై ఫోకస్ పెట్టింది.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. 1947 మన నుంచి పాక్ వేరు పడ్డాక మనకు బాకీ పడింది. ఇప్పటి వరకు మనకు పాక్ దాదాపు రూ.300 కోట్లు ఇవ్వాలి. అది ఇవ్వకపోగా కవ్వింపు చర్యలు మేకపోతు గాంభీర్యాలు పలుకుతోంది. 2025 నాటికి పాక్ అప్పులు 130 బిలియన్ డాలర్లు ఉండగా… అందులో పెద్ద మొత్తం చైనాకే ఇవ్వాల్సి ఉంది. పాక్ చైనాకి పడిన బాకీ 26.5 బిలియన్ డాలర్లు.





