OTT Movies This Week: ఈ పండగకు సందడి చేసేందుకు ఎన్నో తెలుగు సినిమాలు థియేటర్‌లో అందుబాటులో ఉన్నాయి. థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూడలేని వారు చక్కగా ఇంట్లో కూర్చుని OTTలో వీక్షిస్తుంటారు. మరి ఈ వారం OTTలో సందడి చేయబోతున్న సినిమాలేంటో చూసేద్దాం.
పాతాళ్ లోక్ సీజన్ 2 (Paataal lok season 2)
బాలీవుడ్ నటి అనుష్క శర్మ నిర్మాతగా వ్యవహరించిన పాతాళ్ లోక్ రెండో సీజన్ ఈ వారం అందుబాటులోకి రానుంది. అమెజాన్ ప్రైం వేదికగా.. జనవరి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
పానీ (Paani)
ప్రముఖ మలయాళ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత జేజు జార్జి నటించిన పానీ సినిమా సోనీ లైవ్‌లో రిలీజ్ కానుంది. ఈ నెల 16 నుంచి అందుబాటులోకి రానుంది.
సూదు కవ్వం 2: నాడుం నాటు మక్కళం (Soodhu Kavvum 2: Nadum Naatu Makkalum)
ఈ తమిళ కామెడీ సినిమా ఆహాలో రిలీజ్ కానుంది. జనవరి 14 నుంచే అందుబాటులోకి రానుంది.
రైఫిల్ క్లబ్ (Rifle Club)
ఇదొక మలయాళం థ్రిల్లర్ సినిమా. నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 16 నుంచి అందుబాటులోకి రానుంది.
బ్యాక్ ఇన్ యాక్షన్ (Back In Action)
ఈ ఆంగ్ల యాక్షన్ కామెడీ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. (OTT Movies This Week)