Orry Awatramani బాలీవుడ్ బడా సెలబ్రిటీలతో పార్టీలకు వెళ్తూ.. వారితో కలిసి వింతగా ఫోటోలు దిగుతూ ఫేమస్ అయిన వ్యక్తి ఆర్హాన్ అవాత్రమాని. అందరూ ఇతన్ని ఆర్రీ అని పిలుస్తారు.
ఇతను ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అయినప్పటికీ బాలీవుడ్ సెలబ్రిటీలను మించిన పాపులారిటీ దక్కించుకున్నాడు. అందరితో ఎంతో ఫ్రెండ్లీగా ఉండే ఆర్రీకి ఉన్నట్టుండి ఏమైందో తెలీదు కానీ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరంగా మాట్లాడి వైరల్ అయ్యాడు.
ఆర్రీపై ఇప్పటివరకు ఎలాంటి కాంట్రవర్సీలు లేవు. అందరితో సరదాగా ఉండటం.. నవ్వుతూ పలకరించడం.. అంబానీలతో సైతం ఫోటోలు దిగడం ఇదే అతని పని. ఇలాంటి వ్యక్తికి ఉన్నట్టుండి ఏమైంది? జోక్‌కి అసభ్యతకు తేడా తెలీదా.
ఇంతకు మ్యాటర్ ఏంటంటే.. ఆర్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసాడు. అందులో ఆర్రీ చొక్కా లోపల బ్రా వేసుకున్నాడు. అది బయటికి క్లియర్‌గా కనిపిస్తోంది.
అయితే.. ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఇంతకీ ఆ బ్రా దేనిని కవర్ చేయడానికి? అని ఆర్రీ పోస్ట్ కింద కామెంట్ చేసింది. దీనికి ఆర్రీ సమాధానం ఇస్తూ.. సారా అలీ ఖాన్ హిట్స్ (టిట్స్- అంటే వక్షోజాలు) కవర్ చేయడానికి అని షాకింగ్ రిప్లై ఇచ్చాడు.
ఈ రిప్లై చూసిన కొందరు సారా అలీ ఖాన్ కూడా ఈ కామెంట్ చూసి నవ్వుకుంటే ఫర్వాలేదు అని కామెంట్ చేయగా.. దీనికి ఆర్రీ స్పందిస్తూ.. అవును తన కెరీర్‌ని చూసి నవ్వుకున్నట్లే అని వెటకారంగా సమాధానం ఇచ్చాడు.
ఇదంతా సారా కంట పడినట్లుంది. అందుకే తనతో పాటు తన సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్ చేత కూడా ఆర్రీని సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయించింది.
ఏదేమైనప్పటికీ ఆర్రీ అమ్మాయి ప్రైవేట్ భాగాల గురించి ఇలాంటి కామెంట్ పెట్టకుండా ఉండాల్సింది.





