Nidhi Agarwal హిట్స్, ఫ్లాప్స్ పక్కనపెడితే ఒకప్పుడు టాలీవుడ్‌లో మంచి ఫాంలో ఉన్న హీరోయిన్ నిధి అగర్వాల్. మధ్యలో చాలా కాలం పాటు ఆమె సినిమాల్లో కనిపించలేదు. ఆ తర్వాత హరిహర వీరమల్లు సినిమాతో అభిమానులను పలకరించారు. ఇప్పుడు ప్రభాస్‌తో కలిసి రాజా సాబ్‌లో నటించే అవకాశం దక్కించుకున్నారు. అయితే.. రాజా సాబ్ ప్రమోషన్స్ కోసం నిధి అగర్వాల్ కన్నడ మీడియాతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు. మీరు పవన్ కళ్యాణ్‌తో నటించారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఉదయనిధి స్టాలిన్‌తో కళగ తలైవన్ సినిమాలో నటించారు ఆయన కూడా తమిళనాడుకి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ప్రభాస్‌తో నటించారు. ఆయన ఏమవుతారని అనుకుంటున్నారు అని అడిగారు. ఇందుకు నిధి సిగ్గుపడుతూ.. ప్రభాస్ రాష్ట్రపతి అవుతారు అని చెప్పారు.





