Tollywood: ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే ఈ మధ్యకాలంలో టాలీవుడ్ నుంచి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పైగా టాప్ హీరోల సినిమాలు కూడా వరుసగా నాలుగు రిలీజ్ అయ్యాయి. వాటిలో దేవర, పుష్ప 2, గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం ఉన్నాయి. సినిమాలపై టాక్ ఎలా ఉన్నా.. ఆడియన్స్ మాత్రం చూడాలన్న ఉత్సాహంతోనే ఉంటారు. కొందరు సినిమాలను థియేటర్లలో చూడటానికి ఇష్టపడతారు. మరికొందరు ఓటీటీల్లో వచ్చే వరకు వేచి చూస్తారు. సరిగ్గా ఇదే పాయింట్‌పై ఫోకస్ చేసింది నెట్‌ఫ్లిక్స్ (Netflix). అతిపెద్ద OTT సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ టాలీవుడ్‌పై భారీగా పెట్టుబడులు పెట్టింది. దాదాపు రూ.1000 కోట్ల బిజినెస్‌ను టాలీవుడ్‌తో చేయబోతోంది. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ పండుగ పేరిట వరుసగా టాలీవుడ్ సినిమాల ఓటీటీ రైట్స్ కొనేసింది. ఇంతకీ నెట్‌ఫ్లిక్స్‌లో 2025లో రాబయే తెలుగు సినిమాలు ఏవో తెలుసా?
OG
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నారు. (Tollywood)
VD 12
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకుండానే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ కొనేసింది.
HIT 3
నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న హిట్ 3 సినిమా ఓటీటీ రైట్స్ కూడా నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇందులో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
తండేల్ (Thandel)
నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) నటించిన తండేల్‌ని కూడా నెట్‌ఫ్లిక్స్ కొనేసింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. (Tollywood)
మాస్ జాతర
మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) నటించిన మాస్ జాతర సినిమాను కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఎంజాయ్ చేయచ్చు. ఇందులో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో ఆల్రెడీ ధమాకా సినిమాలో నటించారు.
వీటితో పాటు నవీన్ పోలిశెట్టి నటిస్తున్న అనగనగా ఒక రాజు, సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న జాక్, ప్రియదర్శి నటిస్తున్న కోర్ట్ సినిమాలు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానున్నాయి. ఈ సినిమాలన్నీ తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ డబ్బింగ్ చేయనున్నారు. (Tollywood)