Search The Query
Search

Image
  • Home
  • Cinema
  • Naga Chaitanya: శోభిత నాతో ఉంటే అంతే చాలు

Naga Chaitanya: శోభిత నాతో ఉంటే అంతే చాలు

Naga Chaitanya నాగ‌చైత‌న్య శోభిత ధూళిపాల జంట డిసెంబ‌ర్ 4న వివాహ బంధంతో ఒక‌టి కానుంది. హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహం అట్ట‌హాసంగా జ‌ర‌గ‌బోతోంది. అయితే.. వీరి వివాహం రాజ‌స్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో జ‌ర‌గ‌బోతోంద‌ని టాక్ న‌డిచింది. తీరా చూస్తే హైద‌రాబాద్‌లోనే అని క్లారిటీ ఇచ్చేసారు. దీనిపై నాగ‌చైతన్య స్పందించారు. ఈరోజు నాగ‌చైత‌న్య త‌న 38వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. ఇందుకోసం ఆయ‌న గోవాకు వెళ్లారు.

“” పెళ్లి ద‌గ్గ‌ర‌ప‌డుతోంద‌న్న ఆతృత ఎక్కువగా ఉంది. సెంటిమెంట్ కావ‌డంతో అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి అనుకుంటున్నాం. అక్క‌డైతే తాత‌గారి ఆశీర్వాదాలు ఉంటాయ‌ని మేం న‌మ్ముతాం. తాత‌గారి విగ్ర‌హం ముందే మా పెళ్లి జ‌ర‌గ‌బోతోంది. ఈరోజు నా బ‌ర్త్‌డే కావ‌డంతో గోవాకి వ‌చ్చాను. నాకు ఆడంబ‌రంగా బ‌ర్త్‌డేలు చేసుకోవ‌డం ఇష్టం లేదు. అందుకే స్నేహితులతో క‌లిసి ప్ర‌శాంతంగా ఉండాల‌నుకుంటున్నాను. ప్లానింగ్ విష‌యాన్ని శోభిత నాకే వ‌దిలేస్తుంది. త‌ను నాతో ఉంటే చాలు ఇంకేం అక్క‌ర్లేదు “” అని తెలిపారు.

సింపుల్‌గానే పెళ్లి చేయ‌మ‌న్నారు

కుమారుడు నాగచైత‌న్య పెళ్లి గురించి అక్కినేని నాగార్జున స్పందించారు. నిశ్చితార్థం రోజు అంతా కూర్చుని ఎలా పెళ్లి చేయాలి అని చ‌ర్చించుకున్నామ‌ని.. త‌మ‌కు సింపుల్‌గా పెళ్లి చేస్తే చాలు అని శోభిత‌, నాగ‌చైత‌న్య అన‌డంతో తానెంతో రిలీఫ్ అయ్యాన‌ని అన్నారు. పెళ్లి బాధ్య‌త‌ను త‌న‌పై పెట్ట‌డంతో అన్నీ తానే ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నాన‌ని అన్నారు.

More News

Raasi
రాశి గారి ఫ‌లాలు.. ఏంటిది?
BySai KrishnaJan 5, 2026

Raasi కొద్ది రోజులుగా యాంక‌ర్ అనసూయ వ‌స్త్ర విధానంపై ర‌చ్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. న‌టుడు శివాజీ హీరోయిన్ వేసుకునే…

Vrushabha is the biggest disaster of 2025
స్టార్ హీరో.. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్లాప్
BySai KrishnaJan 4, 2026

Vrushabha పెద్ద హీరో.. ఆయ‌న‌పై న‌మ్మ‌కంతో రూ.70 కోట్లు పెట్టి సినిమా తీసారు. తీరా చూస్తే 2025లో భార‌త‌దేశంలోనే అతిపెద్ద…

Anasuya Bharadwaj reacts to trolls on her bikini controversy
న‌న్నేం పీక‌లేరు
BySai KrishnaJan 4, 2026

Anasuya Bharadwaj: కొన్ని రోజులుగా యాంక‌ర్, న‌టి అనసూయ భ‌ర‌ద్వాజ్ దుస్తుల తీరుపై ఆమె పోస్ట్ చేసే వ‌ల్గ‌ర్ పోస్ట్‌ల‌పై…

Akhanda 2 on OTT when is Akhanda 2 is releasing on Netflix
Akhanda 2 on OTT: రిలీజ్ ఎప్పుడో తెలుసా?
BySai KrishnaJan 3, 2026

Akhanda 2 on OTT: నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన అఖండ 2 సినిమా ఓటీటీ రిలీజ్ కాస్త ఆల‌స్యం అయ్యింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top