Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై నిన్న రాత్రి ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. బాండ్రాలోని సైఫ్ నివాసంలోకి చొరబడిన ఆ దుండగుడు.. సైఫ్ అడ్డుకోవడంతో అతన్ని కత్తితో పొడిచి పరారయ్యాడు. అతను సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వగా పోలీసులు దుండగుడి ఫోటోను బయటపెట్టారు. త్వరలో పట్టుకుంటామని పది బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం యావత్ భారతదేశంలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం సైఫ్ ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో కోలుకుంటున్నారు. వెన్నెముకకు సర్జరీ చేసినట్లు వైద్యులు చెప్తున్నారు.
కోటి డిమాండ్ చేసిన దుండగుడు
సైఫ్ నివాసంలోకి చొరబడిన నిందితుడు అతని చిన్న కుమారుడు జహంగీర్ బెడ్‌రూంలో కొన్ని గంటల పాటు దాక్కుని ఉన్నాడు. జహంగీర్ బెడ్‌రూంలో ఉన్న ఆయా మంచం దగ్గర నీడ చూసింది. బహుశా కరీనా కపూర్ జహంగీర్‌ని చూసేందుకు వచ్చిందేమో అనుకుని ముందు పట్టించుకోలేదట. కానీ ఆ నీడ కదలకపోవడంతో అనుమానం వచ్చి చూడగా దుండగుడు కత్తితో దాడి చేసేందుకు వచ్చాడు. అరిస్తే పొడిచేస్తానని అంటుండగా.. మరో ఆయా గదిలోకి ప్రవేశించి కేకలు వేసింది.
వెంటనే సైఫ్ తాను ఉంటున్న 11వ అంతస్తు నుంచి కిందికి వచ్చి అతన్ని పట్టుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే సైఫ్‌కి దుండగుడి మధ్య ఘర్షణ జరిగింది. సైఫ్ ఏం కావాలి అని కేకలు వేయగా.. కోటి రూపాయలు ఇస్తే వెళ్లిపోతానని అన్నాడట. సైఫ్ అతన్ని పట్టుకునే క్రమంలో ఆరు సార్లు పొడిచి ఫైర్ ఎగ్జిట్ డోర్ మార్గం నుంచి దుండగుడు పారిపోయాడు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో అంతా రికార్డ్ అయ్యింది. ముంబై పోలీసులు నిందితుడి ఫోటోను రిలీజ్ చేసారు. (Saif Ali Khan)
ఇదంతా అబద్ధమా?
సైఫ్‌పై జరిగిన మర్డర్ అటెంప్ట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని నెలల క్రితం అడల్ట్ స్టార్ పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోయిందని ఒక వార్త తెగ వైరల్ అయ్యింది. చాలా మంది ఆమె పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్స్, పోస్ట్‌లు పెట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులకే తాను బతికే ఉన్నానని.. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ఇలా చేసానని అన్నారు. అయితే ఇప్పుడు సైఫ్‌పై జరిగిన దాడి కూడా అలాంటి ప్రమోషనల్ స్టంటేమో అని చాలా మంది నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సైఫ్ నటించిన జువెల్ థీఫ్ అనే సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఇందులో సైఫ్ ఆభరణాలు దొంగిలించే దొంగ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇలా జరిగిందేమో అని నెటిజన్లు ట్వీట్స్ పెడుతున్నారు. బాండ్రా లాంటి ప్రాంతంలో అంత సెక్యూరిటీ ఉన్న ఇంట్లోకి ఓ దుండుగుడు దూరి కొన్ని గంటల పాటు అక్కడే ఉండి సైఫ్‌పై దాడికి దిగడం ఏంటి.. ఎంత కేకలు వేసినా సెక్యూరిటీ వాళ్లు రాకపోవడం ఏంటి? దుండగుడు అంత సులువుగా ఫైర్ ఎగ్జిట్ నుంచి పారిపోతుంటే ఇంటి బయట నుంచి ఏ సెక్యూరిటీ గార్డు పట్టుకోలేకపోవడం ఏంటి? ఇవన్నీ చూస్తుంటే నమ్మశక్యంగా లేవని అంటున్నారు.
సంజయ్ దత్ కూడా కేజీఎఫ్ సినిమాకి ముందు లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నానని ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన నెల రోజులకే దుబాయ్‌లో చికిత్స తీసుకున్నానని.. ఆ తర్వాత తనకు క్యాన్సర్ లేదని ప్రకటించారు. కానీ క్యాన్సర్ వస్తే ఓ మనిషి ఎలా క్షీణించిపోతాడో తెలిసిందే. అలాంటి లక్షణాలేవీ సంజయ్ దత్‌లో కనిపించలేదు. దాంతో సంజయ్ దత్‌ది కూడా ప్రమోషనల్ గిమ్మిక్కే అని అన్నారు. పైగా ఆయన అక్రమ ఆయుధాల కేసులో అరెస్ట్ అయ్యి కొన్ని సంవత్సరాల పాటు జైల్లో శిక్ష అనుభవించి రిలీజ్ అయ్యారు. దాంతో సింపతీ కోసం ఇలాంటి లంగ్ క్యాన్సర్ డ్రామా ఆడారని అప్పట్లో టాక్ నడిచింది. అంతేకాదు.. అభిషేక్ బచ్చన్ నటించిన బ్రీత్ అనే సిరీస్ రిలీజ్‌కి ముందు కూడా అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ మొత్తానికి కోవిడ్ సోకిందని ప్రకటించారని.. ఆ తర్వాత బ్రీత్ సిరీస్ రిలీజ్ అయ్యిందని.. ఈ బాలీవుడ్ నటీనటులు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారని కామెంట్స్ పెడుతున్నారు. (Saif Ali Khan)