Mukesh Ambani లండన్‌లో బ్రేక్‌ఫాస్ట్.. ప్యారిస్‌లో లంచ్.. మరో దేశంలో డిన్నర్.. ఇలా లైఫ్‌ని ఎంజాయ్ చేసే బిలియనీర్లు ఉన్నారు. అయితే.. రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ ఫేవరేట్ ఫుడ్ ఇప్పుడు వైరల్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆయనకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా? మైసూర్ మసాలా దోస, పాంకీ.
పాంకీ అనేది గుజరాతీ ఫేమస్ ఫుడ్. అది కూడా ఆయన ముంబైలోని మటుంగా ఈస్ట్ ప్రాంతంలో ఉన్న కెఫె మైసూర్ అనే హోటల్ నుంచి వీటిని తెప్పించుకని తింటారట. ఈ హోటల్ 1936లో రమా నాయక్ అనే వ్యక్తి ప్రారంభించారు. ఈ హోటల్‌లో దొరికే మసాలా దోస, పాంకీ అంటే ముఖేష్‌కి చాలా ఇష్టమని ఆయనే చాలా సార్లు చెప్పారు. ఈ దోస ఖరీదు రూ.100.
ముఖేష్ చిన్న కుమారుడు అనంత్, రాధికల వివాహ వేడుకకు కెఫె మైసూర్ కుటుంబాన్ని ప్రత్యేక గెస్ట్‌లు ఆహ్వానించారు. ప్రతి ఆదివారం ముఖేష్ ఇంట్లో కెఫె మైసూర్ నుంచి టిఫిన్ వెళ్తుంది. రసం ఇడ్లీ, రవ్వ దోస, ఉప్మా ప్యాక్ చేసి పంపుతుంటారట. మేం ప్రతి ఆదివారం మీ కెఫె నుంచి వచ్చే టిఫినే తింటాం అని రాధిక కెఫె మైసూర్ ఓనర్ తల్లి శాంతేరీ నాయక్‌కు చెప్పారట. పెళ్లి వేడుకలో అనంత్ దంపతులు ఆమె కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీస్కోవడం వైరల్‌గా మారింది.





