MS Dhoni: ఈ ఏడాది మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించేస్తాడు అని చాలా ప్రచారం చేసారు. ఈ ఏడాదనే కాదు.. మూడేళ్లుగా ప్రతి ఐపీఎల్ సమయంలో ధోనీ రిటైర్మెంట్ గురించి చర్చ వస్తూనే ఉంటుంది. ఈసారి మాత్రం ధోనీ స్పందించాల్సి వచ్చింది. తన స్వస్థలం అయిన ఝార్ఖండ్‌లో కొన్ని రౌండ్లు బైక్ రైడ్స్ చేసి ఆ తర్వాత ఏ విషయం అన్నది డిసైడ్ అవుతాను అని అన్నారు.
వచ్చే ఏడాదికి ప్లేయర్‌లా కాకుండా కోచ్‌గా ఎంట్రీ ఇవ్వాలని చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు. అయితే.. ధోనీ మెంటార్‌గా మాత్రమే పనికొస్తాడు కానీ కోచింగ్‌కి కాదని అంటున్నారు మాజీ ఫాస్ట్ బౌలర్ అతుల్ వాస్సన్. ధోనీకి ప్రస్తుత టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్‌కి ఉన్నంత ఓపిక లేనే లేదని.. గౌతూకి టీంని ఎలా కంట్రోల్‌లో పెట్టుకోవాలో తెలుసని.. ఆ పని ధోనీ చేయలేడని అనేసారు. ఈ సమయంలో ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తే ఫ్యామిలీతో సమయం గడపాలనుకుంటాడు కానీ.. మళ్లీ కోచ్‌గా మారి టీం ఎక్కడికి వెళ్తే అక్కడికి పరిగెత్తలేడని తెలిపారు. ధోనీలో ఆడాలన్న కసి ఇంకా ఉన్నప్పటికీ ఫిట్‌నెస్ కూడా చూసుకోవాలని 2026 IPLలో ధోనీ ఇరగదీయాలంటే ఇప్పటి నుంచే ఫిట్నెస్ మీద ఫోకస్ చేయాలని సలహా ఇచ్చారు.