Chiranjeevi Mohanlal ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో వేరే భాషకు చెందిన స్టార్ హీరోలను అతిథి పాత్రల్లో పెట్టి తీయాలంటే అంత కష్టపడాల్సి వచ్చేది కాదు నిర్మాతలకు. ఎందుకంటే వాళ్లు కూడా అరెరె సల్మాన్ ఖాన్ సినిమానా.. చిరంజీవి సినిమానా.. అని అతిథి పాత్రలను ఉచితంగా చేయడానికి కూడా ఒప్పుకునేవాళ్లు. ఇప్పుడు ఆ కాలం పోయినట్లే అనిపిస్తోంది. అందుకు చిరంజీవి బాబి కొల్లి కాంబినేషన్‌లో రానున్న చిరు 158 సినిమానే నిదర్శనం.
ఈ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ను అతిథి పాత్రలో తీసుకోవాలని బాబి నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్‌ను కోరారట. సరే అని మోహన్ లాల్‌ను సంప్రదిస్తే.. ఆయన కేవలం అతిథి పాత్రకే రూ.30 కోట్లు అడిగినట్లు సమాచారం. అంత మొత్తం ఫుల్ లెన్త్ క్యారెక్టర్‌కి కూడా ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీలో చూస్తున్నాం. దాంతో మోహన్ లాల్‌ను పక్కన పెట్టి తెలుగులోనే ఎవరైనా కాస్త తక్కువ రెమ్యునరేషన్‌కి ఆ అతిథి పాత్ర చేస్తారేమో అనే వెతుకులాట జరుగుతున్నట్లు తెలుస్తోంది.





