Mobile Tips: కొన్నిసార్లు మనకు నచ్చని వారు కాల్స్ చేస్తుంటారు. వాళ్ల ఫోన్ అస్సలు లిఫ్ట్ చేయాలనిపించదు. అన్ని కాల్స్ బ్లాక్‌లో పెట్టలేం. అలాగని కాల్ మాట్లాడలేం. పోనీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేద్దామా అంటే మనకు అవసరమయ్యే కాల్స్ వచ్చినప్పుడు ఇబ్బంది అయిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? మీరు ఎవరి కాల్స్ అయితే రావద్దు అనుకుంటున్నారో వారి కాల్స్ రాకుండా ఉండేందుకు ఓ టిప్ ఉంది.ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయిపోండి.
ఏం చేయాలి?
ఇందుకోసం ముందు మీరు మీ ఫోన్‌లోని కాల్స్ ఆప్షన్‌కి వెళ్లండి. అక్కడ సప్లిమెంటరీ సర్వీస్ ఆప్షన్ అని ఉంటుంది. దానిని ఎంచుకోండి.
సప్లిమెంటరీ ఆప్షన్‌పై క్లిక్ చేయగానే కాల్ వెయిటింగ్ ఆప్షన్ వస్తుంది. చాలా మటుకు ఫోన్లలో కాల్ వెయిటింగ్ ఆప్షన్ ఆన్‌లో ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్‌లో డీఫాల్ట్‌గా ఆన్‌లో లేకపోతే మంచిదే. ఒకవేళ ఎనేబుల్ చేసి ఉంటే దానిని డిసేబుల్ చేయండి.
ఆ తర్వాత కాల్ ఫార్వడింగ్ ఆప్షన్‌లోకి వెళ్లండి.
అక్కడ మీకు రెండు ఆప్షన్లు వస్తాయి. వాయిస్ కాల్స్ ఆప్షన్, వీడియో కాల్స్ ఆప్షన్ అని ఉంటుంది. మీరు వాయిస్ కాల్‌ని సెలెక్ట్ చేసుకోండి.
వాయిస్ కాల్స్‌పై క్లిక్ చేయగానే మీకు నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ఫార్వర్డ్ వెన్ బిజీ ఆప్షన్‌ను (Forward When Busy) ఎంచుకోండి.
మీరు ఏ నెంబర్‌కి కాల్ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్‌ని నమోదు చేయండి. మీరు నమోదు చేసే నెంబర్ స్విచ్ఛాఫ్‌లో ఉండాలి.
ఆ నెంబర్ ఎంటర్ చేసాక ఎనేబుల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అంతే.. మీకు ఎవరి కాల్స్ అయితే చిరాకు తెప్పిస్తాయో.. ఎవరి కాల్స్ నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారో వారు మీకు ఫోన్ చేసిన ప్రతిసారి స్విచ్ఛాఫ్ అని వస్తుంది. (Mobile Tips)
ఈ యాప్ పేర్లు చెప్పేస్తుంది
సాధారణంగా మన చేతిలో ఫోన్ ఉంటే మనకు ఎవరు కాల్ చేస్తున్నారో తెలుస్తుంది. వారి పేర్లు సేవ్ చేసుకుంటే పేర్లతో సహా కనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఫోన్ ఒక చోట మీరు ఒకచోట ఉన్నప్పుడు మీకు ఎవరు కాల్ చేస్తున్నారో తెలీదు. అలాంటప్పుడు ఈ యాప్ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే వారికి ట్రూకాలర్ యాప్ ద్వారా ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. కానీ ఐఫోన్ వాడేవారికి ఈ ఆప్షన్ సెట్టింగ్స్‌లో ఉంది.
ట్రూ కాలర్ యాప్‌లోకి వెళ్లి చివర కనిపించే మూడు చుక్కల బటన్‌పై క్లిక్ చేయండి. అక్కడ కనిపించే సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లి కాల్స్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి.
కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అనౌన్స్ కాల్స్ బటన్ ఉంటుంది. దానిని ఎనేబుల్ చేసుకుంటే.. ఫోన్ మీ చేతిలో లేకపోయినా మీకు ఎవరు కాల్ చేస్తున్నారో వారి పేరును చెప్తుంది.