Chahal Dhanashree: క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. ధనశ్రీ వర్మ విడాకులు తీసుబోతున్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో వీరిద్దరూ ప్రత్యేకించి స్పందిస్తేనే అసలు విషయం ఏంటి అనేది తెలుస్తుంది. అయితే ఇప్పుడు ధనశ్రీ తన ఇంట్లోనే తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. చాహల్ తన పనిలో తానున్నాడు. మధ్యలో చాహల్ ఫ్యాన్స్ ధనశ్రీపై పడి ఏడుస్తున్నారు.
ధనశ్రీపై చాహల్ ఫ్యాన్స్ అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారంటే ఓ అర్థం ఉంది. ఎందుకంటే ఫ్యాన్సే పని పాటా లేకుండా ఇలా సోషల్ మీడియాలో పడి ఎవరిపై దుమ్మెత్తిపోద్దామా అనే పనిలో ఉంటారు. కానీ చాహల్, ధనశ్రీ విషయంలో ఓ క్రికెటర్ తప్పుడు కామెంట్ చేసాడంటే నమ్ముతారా? కానీ ఇది నిజంగా జరిగింది. ఆ క్రికెటర్ ఎవరో కాదు. పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తే. ఇతని పేరు మయాంక్ మిశ్రా. ఇతను ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నాడు. అతని ఇన్‌స్టాగ్రామ్ బయో చూస్తే రంజీ ట్రోఫీలో ఆడినట్లు కూడా తెలుస్తోంది.
ఇతను ధనశ్రీపై తప్పుడు కామెంట్ చేసాడు. ధనశ్రీ తన తల్లితో కలిసి ఓ ఫోటో పోస్ట్ చేసారు. ఆ ఫోటోకి తొలి కామెంట్ పెట్టింది మయాంక్ మిశ్రానే. రూ.62 కోట్లు.. ఇదన్నమాట ప్లాన్. ఈ ప్లాన్ గురించి నాకు ఎప్పటి నుంచో తెలుసు. అని కామెంట్ చేసాడు. ఈ కామెంట్‌పై ఓ నెటిజన్ స్పందిస్తూ.. వారి జీవితం గురించి నీకెందుకు బ్రో అని గడ్డిపెట్టారు. దీనికి మయాంక్ స్పందిస్తూ.. నా తోటి క్రికెటర్ పట్ల మోసం జరిగితే స్పందించకుండా ఉంటానా అని డైలాగ్ కొట్టాడు. (Chahal Dhanashree)
ఇంతకీ ఈ రూ.62 కోట్ల గొడవేంటి అనుకుంటున్నారా? విడాకుల తర్వాత తనకు రూ.62 కోట్లు భరణంగా కావాలని ధనశ్రీ చాహల్‌ను డిమాండ్ చేసిందట. ఇందుకు చాహల్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. పెళ్లికి ముందు ధనశ్రీ డెంటిస్ట్‌గా.. యూట్యూబర్‌గా.. డ్యాన్సర్‌గా తనకంటూ ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకుంది. కోవిడ్ సమయంలో లాక్ డౌన్ ఉండగా.. క్రికెట్ మ్యాచ్‌లు లేక ధనశ్రీ వద్ద డ్యాన్స్ నేర్చుకునేందుకు వెళ్లాడు చాహల్. అప్పుడే ఆమెకు ప్రొపోజ్ చేయడం.. ఆ తర్వాత ధనశ్రీ ఒప్పుకోవడం.. వీరి పెళ్లి ఘనంగా జరగడం చకచకా జరిగిపోయాయి.
ఆరేళ్ల పాటు వీరి కాపురం బాగానే సాగింది. 2024 సెప్టెంబర్ నుంచి వీరు విడాకులు తీసుకోనున్నట్లు రూమర్స్ వచ్చాయి. వాటిలో నిజం లేదని గతంలో చాహల్ చెప్పాడు. అప్పుడు ఎలాంటి గొడవలు లేవు. కానీ ఈసారి మాత్రం నిజంగానే విడిపోనున్నారు. త్వరలో అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించనున్నారు.