Crime News ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పరువు హత్య ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఒక కులానికి చెందిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ వేరే కులానికి చెందిన వారిని ప్రేమిస్తే పరువు హత్యలు జరుగుతాయన్న సంగతి మనకు తెలిసిందే. కానీ ఓ తండ్రి తన కుటుంబంలోని అబ్బాయితోనే లేచిపోయిన కూతుర్ని తుపాకీతో కాల్చి చంపాడు. ఎందుకో తెలుసుకుందాం.
ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో చోటుచేసుకుంది. 21 ఏళ్ల నిధి అనే అమ్మాయికి ఆల్రెడీ వేరొకరికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేసారు. కానీ నిధి తన బంధువుల్లోని అబ్బాయినే ఇష్టపడినట్లు తెలుస్తోంది. ఇందుకు నిధి తండ్రి ఒప్పుకోలేదు. గతేడాది డిసెంబర్ 11న గ్వాలియర్ ప్రాంతానికి చెందిన అబ్బాయితో నిధి వివాహాన్ని ఘనంగా జరిపించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం నిధి తన భర్తతో కలిసి గ్వాలియర్‌కు షాపింగ్‌కి వెళ్లింది.
నిధి భర్త నీళ్ల బాటిల్ తీసుకురావడానికి పక్కకు వెళ్లగానే నిధి తాను ప్రేమించిన వ్యక్తితో లేచిపోయింది. ఈ విషయం నిధి తండ్రికి తెలీడంతో.. తన ఇంటి వద్ద ఉన్న పొలం దగ్గరికి వస్తే మాట్లాడి నచ్చినవాడితోనే పెళ్లి చేస్తాను అని నమ్మించాడు. అది నమ్మి నిధి పొలం వద్దకు వెళ్లగానే ఆవేశంతో ఆమె తండ్రి నాటు తుపాకీతో కాల్చి చంపేసాడు. ఆ తర్వాత ఆయన పారిపోయేందుకు యత్నించలేదు. నిధి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.





