Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వస్తూ ఓ బండి వద్ద ఆగి మోమోస్ తింటుంటాడు. దీనిని గమనించిన ఆ మోమోస్ బండి యజమాని కుట్ర పన్నాడు.
అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.85 లక్షల విలువైన బంగారాన్ని దొంగిలించారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకుంది.
దేవోరియా ప్రాంతానికి చెందిన విమలేష్ అనే పూజారి తన కుమారుడిని స్కూల్లో దింపి ఆలయానికి వెళ్తుండేవాడు.
ఆ బాలుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం రోజూ మోమోలు తినే ఇంటికెళ్లేవాడు. రోజూ ఆ బాలుడిని గమనిస్తున్న ఆ మోమోలు అమ్మే దుకాణదారుడు బాలుడితో మాటలు కలిపాడు.
నువ్వు మీ ఇంట్లో ఉన్న బంగారం తెచ్చిస్తే రోజూ రెండు మూడు ప్లేట్ల మోమోలను ఉచితంగా తినచ్చు ఆని ఆశజూపాడు. దాంతో ఆ బాలుడు రోజుకో నగ తీసుకెళ్లి అతని చేతిలో పెట్టి మోమోలు లాగించేవాడు.
ఆ బాలుడి సోదరి ఇంటికి వచ్చి నగల గురించి అడిగ్గా.. ఇంట్లో నగలు మాయమయ్యానని తెలిసింది. అప్పుడు విమలేష్ తన కుమారుడిని అడగ్గా.. మోమో అంకుల్ ఫ్రీగా మోమోలు ఇస్తానంటే అతనికి ఇచ్చానని చెప్పాడు.
దాంతో విమలేష్ హుటాహుటిన పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.





