Magha Masam 2025: జనవరి 30 నుంచి మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి 28తో ముగుస్తుంది. అహం అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. మాఘం అంటే పాపాలను నశింపజేసేది అనే అర్థాన్ని పండితులు చెప్తున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం ప్రత్యేక విశిష్టతను సంతరించుకుంది. పాపాలను నశింపజేసే శక్తి ఉన్న మాఘమాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అయితే ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు, పూజలు చేస్తే.. ఏ నియమాలు పాటిస్తే.. భగవంతుని అనుగ్రహం సులభంగా పొందుతారో తెలుసుకుందాం. మనకు పురాణాలలో నదీ స్నానాలకు ఉత్తరాయణంలో మాఘమాసం దక్షిణానయంలో కార్తీక మాసం అని పెద్దలు చెప్తారు. సూర్యభగవానుడు మకర రాశిలో సంచరిస్తుండగా చేసే పుణ్య నది స్నానాలకు విశేషమైన పుణ్య ఫలం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్య నదీ స్నానం, దానం, తర్పణం వంటివి ఆచరిస్తారో వారికి విశేషమైన పుణ్య ఫలం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మాఘమాసంలో ఉదయాన్నే నువ్వులతో దీపారాధన చేసిన వారికి.. నువ్వులతో హోమం, దానం చేస్తే ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుతాయని పెద్దలు చెప్తున్నారు. మాఘమాసంలో పుణ్య నది స్నానాలకు ఎంతటి ప్రాధాన్యం ఉందో దానాలకు కూడా అంతే విశేషమైనది. మాఘమాసం శుద్ధ విధియ నాడు బెల్లం దానం చేయడం.. ఉప్పును దానం చేయడం వల్ల శుభాలు కలుగుతాయని పుణ్యం వస్తుందని మాఘ పురాణం స్పష్టంగా తెలియజేసింది. మాఘమాసంలో చవితిలో ఉమాదేవిని, వినాయకుడిని పూజించడం విశేషం.
Magha Masam 2025 మాఘమాస శుక్ల పక్ష పంచమి రోజున సరస్వతిని పూజించడం వల్ల ఆమె కటాక్షం సిద్ధిస్తుంది. మాఘమాసం శుద్ధ, మందార, కామ, వరుణ షష్ఠి రోజుల్లో వరుణ దేవుడిని మందారం, ఎర్ర చందనంతో పూజిస్తారు. రథ సప్తమి రోజు చేస్తే సూర్యారాధనకు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మాఘమాస శుద్ధ అష్టమిని భీష్మాష్టమి అని ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. మాఘమాసంలో భీష్మ అష్టమి నుంచి భీష్మ ఏకాదశి వరకు విష్ణు సహస్ర నామాన్ని పారాయణం చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మాఘమాసంలో ఎవరైతే పుణ్య నదీ స్నానం ఆచరిస్తారో వారికి విశేషమైన పుణ్య ఫలం లభించి రాజయోగం పడుతుందట.
కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఈ మాఘ మాసంలో నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే మంచిది. నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగ, గోదావరి, కావేరీ వంటి పుణ్య నదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేస్తే మంచిది. మాఘమాసంలో ప్రతి రోజూ ఉదయాన్నే నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది. మరీ ముఖ్యంగా మాఘమాసంలో శివాలయంలో దీపం వెలిగిస్తే ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఈ మాసంలో ప్రతిరోజూ దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.
Magha Masam 2025 ముఖ్యంగా ఈ మాసంలో దేవుడికి పూజ చేసేటప్పుడు ఎర్ర రంగు పువ్వులను పూజలో వాడితే ముక్కోటి దేవతలు సంతోషించి సిరిసంపదలను ప్రసాదిస్తారు. ఎర్ర మందారం పూలతో పూజ చేస్తే మరీ మంచిది. మాఘ మాసం నుంచి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే. ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. మాఘమాసంలో కచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్ర నామాలు చదవాలి. ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్ర నామాలు పారాయణం చేస్తారో ఆయన అనుగ్రహం కలిగి తీరుతుంది. శివ కేశవులకు కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో మాఘమాసం కూడా అంతే ఇష్టం. కాబట్టి ఈ మాఘ మాసంలో శివ కేశవుల పూజకు విశిష్ఠ స్థానం ఉంది. ఈ మాసంలో శివకేశవులు ముక్కోటి దేవతలతో కలిసి ఆలయాల్లో ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి.
కాబట్టి ఈ మాసంలో మీకు కుదిరినప్పుడు శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆయనకు ఇష్టమైన వెలగపండు నైవేధ్యంగా సమర్పిస్తే ఆయన సంతోషించి కోరిన వరాలను అనుగ్రహిస్తాడు. మాఘ మాసంలో సాక్షాత్తు లక్ష్మీ దేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు. కాబట్టి లక్ష్మీ దేవి స్వరూపమైన తులసిని పూజించడం ద్వారా సకల సంపదలు పొందవచ్చు. ముఖ్యంగా ఆడవారు తులసి దగ్గర దీపం, ధూపం, పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి ఆమెకు నమస్కారం చేస్తే ఐశ్వర్యం సుమంగళి యోగం కలుగుతుంది.
మీ చిరకాల కోరిక వెంటనే తీరాలంటే మాఘమాసంలో శుక్రవారం గులాబీ పూలు సమర్పించి దీపారాధన చేసి ఎండుద్రాక్షను నైవేధ్యంగా పెట్టి నమస్కరిస్తే వెంటనే కోరికలు తీరతాయి. అలాగే.. ఈ మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం చేకూరుతుంది. మాఘమాసంలో వచ్చే శనివారాలు ఇంట్లో పిండి దీపాలు వెలిగించి తులసి దీపాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆయన అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు చేకూరతాయని శాస్త్రాలు చెప్తున్నాయి.