High Court ఓ యువతితో సహజీవనం చేసి ఆ తర్వాత ఆమెను వదిలించుకున్న వ్యక్తి కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
మోడ్రన్, ఫ్యాషన్ పేరుతో సహజీవనం చేసేసి ఆ తర్వాత అమ్మాయిల్ని వదిలేసి వారి గురించి సమాజంలో తప్పుగా మాట్లాడుతున్న మగవాళ్ల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.
తమిళనాడుకి చెందిన ఓ యువతి తనతో సహజీవనం చేసి ఆ తర్వాత వదిలేసిన తిరుచిరాపల్లికి చెందిన వ్యక్తిపై కేసు వేసింది. ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవడంతో న్యాయమూర్తి శ్రీమతి కీలక వ్యాఖ్యలు చేసారు.
కొన్ని తరహా సహజీవనానికి సంబంధించిన కేసులను గాంధర్వ వివాహంలా భావించాల్సి వస్తుందని అన్నారు. ఎనిమిది నెలల పాటు కలిసున్నాక ఆ వ్యక్తి అమ్మాయికి భార్య స్థానం కల్పించేలా చూడాలని తీర్పునిచ్చారు. అలా చేయనప్పుడు కచ్చితంగా న్యాయపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.
ఒకవేళ ఎనిమిది నెలల తర్వాత పెళ్లి చేసుకునేందుకు యువతి ఒప్పుకోకుండా.. ఆ తర్వాత ఆ వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవాలని కోర్టుకెక్కితే మాత్రం ఆ కేసు చెల్లదని కూడా చెప్పారు.
ఇక ఈ కేసులో నిందితుడు చాలా మంది అమ్మాయిలతో సహజీవనం చేసిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.





