Linkedin: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ సోషల్ నెట్‌వర్క్ అయిన లింక్డిన్ యూజర్లకు షాకింగ్ న్యూస్. ఈ యాప్ వాడే యూజర్ల డేటా మొత్తం థర్డ్ పార్టీల చేతిలోకి వెళ్తోందట. ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా అమెరికానే వెల్లడించింది. ఈ అంశంపై అమెరికాలో కేసు కూడా నమోదైంది. లింక్డిన్ వారే వారు చాలా మంది ప్రొఫెషనల్స్‌కు మెసేజ్‌లు పంపుతుంటారు. ప్రొఫెషనల్‌గానే కాకుండా కాస్త పర్సనల్‌గానూ లింక్డిన్‌ని వాడేస్తున్నారు. లింక్డిన్‌లోనే చాటింగ్స్ కూడా చేసుకుంటున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే లింక్డిన్ మినీ ఇన్‌స్టాగ్రామ్ అయిపోయింది. యూజర్లు చేసుకునే చాటింగ్స్‌ని థర్డ్ పార్టీ యాప్స్‌కి ఇవ్వడంతో వాళ్లు ఆ మెసేజ్‌లతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ని ట్రైన్ చేస్తున్నారట. ఈ విషయాన్ని అమెరికాలో వేసిన పిటిషన్‌లో స్పష్టంగా రాసారు. గతేడాది ఆగస్ట్‌లో లింక్డిన్ ఓ తెలివైన పని చేసింది. ప్రైవసీ సెట్టింగ్స్ పేరిట ఓ అప్డేట్ ఇచ్చింది. ఈ అప్డేట్ ద్వారా యూజర్ల డేటా మొత్తం గోప్యంగా ఉంటుందని నమ్మబలికింది. దాంతో చాలా మంది ఆ సెట్టింగ్‌ను అప్డేట్ చేసుకుని వాడుకుంటున్నారు. ఇప్పుడు ఎంత మందైతే వాడుతున్నారు దానిని థర్డ్ పార్టీ యాప్స్ చేతిలో పెట్టేస్తున్నారు. (Linkedin)
అయితే ఈ విషయాన్ని యూజర్లకు తెలియపర్చాలనుకున్నారు. ఇందుకోసం లింక్డిన్ పేరెంట్ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్ ఒక ప్లాన్ వేసింది. నేరుగా ఈ విషయాన్ని చెప్తే లింక్డిన్ డీయాక్టివేషన్స్ అవుతాయని భావించి.. ఈ ప్రైవేట్ డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్స్‌ను ట్రైన్ చేసేందుకు లింక్డిన్ వాడుకుంటుంది అని షరతుల్లో పేర్కొన్నారు. మనకున్న దరిద్రమైన అలవాటు ఏంటంటే.. అసలు షరతులు, నిబంధనలు చదవం. నేరుగా యాక్సెప్ట్ బటన్ కానీ ఎగ్రీ బటన్ కానీ క్లిక్ చేసేసి మన ప్రైవసీని వారి చేతుల్లో పెట్టేస్తుంటాం.
ఈ పిటిషన్‌ని కూడా లింక్డిన్ ప్రీమియం వాడే యూజరే వేసాడు. లింక్డిన్ చేసిన ఈ పనికి గానూ ఒక్కో యూజర్‌కు 1000 డాలర్లు జరిమానా చెల్లించాలని కోర్టును కోరాడు. అయితే ఇవన్నీ కేవలం అసత్య ఆరోపణలు మాత్రమే అని తాము ఎలాంటి డేటాను థర్డ్ పార్టీ చేతిలో పెట్టలేదని లింక్డిన్ బుకాయిస్తోంది. లింక్డిన్‌ని వందల కోట్ల మంది వాడుతున్నారు. వారిలో అత్యధికంగా వాడేది అమెరికన్లే. కేవలం 2023లోనే లింక్డిన్ సంస్థకు ప్రీమియం సభ్యత్వాల ద్వారా వచ్చిన లాభాలు 1.7 బిలియన్ డాలర్లు. ఇలా సభ్యత్వాల పేరుతో మోసం చేస్తూ డేటాను లీక్ చేస్తోందని వాపోతున్నారు. దీనిపై కోర్టు ఇంకా స్పందించలేదు. (Linkedin)