Kurnool Bus Accident: శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్‌కి చెందిన బస్సులో మంటలు చెలరేగి ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 20 మందికి పైగా మృతిచెందినట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై తెలుగు దేశం పార్టీకి చెందిన నంద్యాల నియోజకవర్గ మంత్రి బైరెడ్డి శబరి స్పందించారు. కేవలం 2-3 నిమిషాల వ్యవధిలోనే బస్సుకు పూర్తిగా మంటలు వ్యాపించాయని.. ఈ ఘోర ప్రమాదం నుంచి 19 మంది ప్రయాణికులనే రక్షించగలిగామని అన్నారు.
మంటలు చెలరేగగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆ 19 మందిలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి కొందరు సీటు అద్దాలు పగలగొట్టి మరికొందరు దూకేసి తప్పించుకున్నారు. వారికి స్వల్ప గాయాలు కావడంతో స్థానిక హాస్పిటల్స్‌కి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కానీ బైరెడ్డి శబరి మాత్రం మంటలు చెలరేగిన సమయంలో ఆమె అక్కడే ఉన్నట్లు ఆ 19 మందిని తానే బయటికి తీసి కాపాడినట్లు చెప్తున్నారంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
కర్నూలుకు చెందిన శివశంకర్ అనే యువకుడు ఆ బస్సు ప్రయాణిస్తున్న సమయంలోనే బైక్‌పై వెళ్తూ వెనక నుంచి బస్సును ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు బైకు బస్సు కిందకు వెళ్లి రాసుకుంటూ వెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరిగిందో గ్రహించేలోపే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.





