Kodali Nani On Vamsi Arrest: వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్‌పై కొడాలి నాని స్పందించారు. ఇంతకాలం ఎందుకు మీడియా ముందు రాలేదు.. ఎందుకు వల్లభనేని వంశీ అరెస్ట్ గురించి మాట్లాడలేదు అని ప్రశ్నించగా.. తనను ఓడించి ఉద్యోగం నుంచి పీకేసారని.. ఉద్యోగం పోయాక ఎవరైనా బయటికి వచ్చి మాట్లాడతారా అని చమత్కరించారు. వంశీ అరెస్ట్‌ను ఎలా చూస్తున్నారు అని అడగ్గా.. అరెస్ట్ లాగే చూస్తున్నాను అన్నారు.
తర్వాత రెడ్ బుక్‌లో మీ పేరే ఉంది కదా అని అడగ్గా.. ఆ రెడ్ బుక్ ఏంటో తనకు తెలీదని.. తానెప్పుడూ చూడలేదని అన్నారు. ఇప్పటికే మూడు కేసులు పెట్టారని వార్తల్లో చూస్తేనే తెలిసిందని.. మూడు కాదు 30 కేసులు పెట్టుకోమనండి అని వ్యాఖ్యానించారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి యాక్టివ్‌గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవాళ్లం అని ఇప్పుడు ఉద్యోగం పోవడంతో (ఓడిపోవడంతో) ఇంట్లో కూర్చుంటున్నాం అని అన్నారు.