Kiran Abbavaram: నటుడు కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. రాజావారు రాణివారు సినిమాలో జంటగా నటించిన కిరణ్ అబ్బవరం, రహస్యా గోరక్‌లు నిజంగానే ప్రేమలో పడి గతేడాది వివాహం చేసుకున్నారు. కాగా.. ఇప్పుడు తన భార్య గర్భం దాల్చిందని కిరణ్ శుభవార్తను చెప్పారు.






