Tulsi Plant: మనలో చాలా మందికి తులసి మాతకు పూజ చేసే అలవాటు ఉంటుంది. తులసి కోటను ఎంతో అందంగా అలంకరించుకునే వారు కోకొల్లలు. అయితే.. తులసి అమ్మ దగ్గర కొన్ని వస్తువులను పెడితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట. అవేంటంటే..
గోమతి చక్రం
తులసి అమ్మ దగ్గర గోమతి చక్రం పెడితే ఆయుర్దాయం ఉండదట. తులసి అమ్మ ఉన్న చోట యముడి చూపు కూడా పడదు అని పెద్దలు చెప్తుంటారు. తులసి కోట దగ్గర గోమతి చక్రం ఉంటే నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్లిపోతుంది.
సాలిగ్రామం
సాలిగ్రామాన్ని విష్ణు స్వరూపంగా భావిస్తాం. తులసిని లక్ష్మీదేవితో సమానంగా చూస్తారు. కాబట్టి.. తులసి కోట వద్ద ఒక సాలిగ్రామాన్ని పెట్టేలా చూడండి. ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం ఎల్లవేళలా మీపై ఉంటుంది.
పసుపు
తులసి కోటకు పసుపు రాసి కుంకుమ పెడుతూ ఉంటాం. అదే విధంగా తులసి మొదళ్ల దగ్గర కాస్త పసుపు వేస్తూ ఉండండి. విష్ణు మూర్తికి పసుపు అంటే ప్రీతి.
పచ్చి పాలు
వారంలో ఒకసారైనా తులసి మాతకు పచ్చి పాలను పోస్తూ ఉండండి. చెట్టు మొదళ్లలో పచ్చి పాలు పోస్తే ఎంతో మంచిది. ఆర్థిక సమస్యలు నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి.