Kalvakuntla Kavitha: మా దగ్గర పింక్ బుక్ ఉంది.. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే.. అప్పుడు అందరి లెక్కలు తేలుస్తాం అంటున్నారు BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కార్యకర్తలతో కలిసి ఓ సమావేశంలో పాల్గొన్న కవిత.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కామెంట్స్ చేసారు.
ట్విటర్‌లో ఎవరైనా కామెంట్స్ పెట్టినా.. ఫేస్‌బుక్‌లో ఎవరైనా ఓ వీడియో పెట్టినా రేవంత్‌కి భయమని.. ఇలా చేస్తున్నవారిని వెంటనే అరెస్ట్ చేయించేందుకు తెల్లవారుజామునే పోలీసులను ఇంటికి పంపుతాడని అన్నారు. తమ కోఆర్డినేటర్లను వారి కుటుంబీకులను అరెస్ట్ చేయించి టార్చర్ పెట్టారని.. తాము కూడా పింక్ బుక్‌ని మెయింటైన్ చేస్తున్నామని అన్నారు.
అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామని.. ఇంతకింత అనుభవించేలా చేస్తామని అన్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని.. అందరి లెక్కలు కచ్చితంగా తేలుస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో తెలుగు దేశం పార్టీ నేత నారా లోకేష్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ తెగ వైరల్ చేసారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చేసిన అరాచకాలన్నీ రెడ్ బుక్‌లో రాసుకున్నానని.. ఆ బుక్ ద్వారానే ఇప్పుడు తప్పు చేసిన వారి పని పడుతున్నానని అన్నారు. ఇప్పుడు BRS కూడా తెలుగు దేశం పార్టీనే ఫాలో అవుతున్నట్లు ఉంది. రాబోయే ఎన్నికల్లో BRS కూడా పింక్ బుక్‌ని వైరల్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది.