Jada Sravan: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌ని చూస్తే దివంగత నటుడు ఎంఎస్ నారాయణ గుర్తొస్తున్నారని అన్నారు జైభీం పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్. ఒట్టేసి చెబుతున్నా సినిమాలో ఎంఎస్ నారాయణ నటించిన రేనా రెడ్డి క్యారెక్టర్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఇప్పటికీ ఆయన క్యారెక్టర్ మీమ్స్‌లో వైరల్ అవుతూనే ఉంది.
ఆ సినిమాలో ఫేక్, జోకర్ రౌడీలా నారాయణ ఎలా ఉంటారో.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేష్ అలాగే ఉన్నారంటూ జడ శ్రవణ్ షాకింగ్ కామెంట్స్ చేసారు. ఎన్నికలకు ముందు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా.. రాసి పెట్టుకోండి తమ్ముళ్లూ అని నమ్మించి అధికారంలోకి వచ్చిన లోకేష్‌ని చొక్కా పట్టుకుని రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చి అడగాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు, జనాలకు లేదా అని ప్రశ్నించారు.





