Sharwanand Divorce: ప్రముఖ టాలీవుడ్ నటుడు శర్వానంద్.. ఆయన భార్య రక్షితా రెడ్డిలు విడాకులు తీసుకోబోతున్నారా? విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అవుననే తెలుస్తోంది. రెండేళ్ల క్రితం సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన రక్షితా రెడ్డిని శర్వా పెళ్లి చేసుకున్నారు. గతేడాది వీరికి పండంటి పాప పుట్టింది. ఉన్నట్టుండి వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారని చర్చ మొదలైంది.
కారణాలు ఏమైనప్పటికీ.. శర్వా, రక్షిత ప్రస్తుతం విడాకుల దాకా వెళ్లకుండా పాప కోసం విడి విడిగా ఉండాలనుకుంటున్నారట. కొన్ని నెలలు పాప శర్వాతో మరికొన్ని నెలలు రక్షితతో ఉంటుందట. అయితే.. శర్వా ఇన్‌స్టాగ్రామ్‌లో తన భార్యతో దిగిన పెళ్లి ఫోటోలు, పాపతో దిగిన ఫోటోలు మాత్రం అలాగే ఉన్నాయి. మరి ఈ డివర్స్ గాసిప్స్‌పై శర్వా నోరు విప్పితే తప్ప ఓ క్లారిటీ వచ్చేలా లేదు. ఇక సినిమాల విషయానికొస్తే.. 2022లో ఒకే ఒక జీవితం, మనమే సినిమాలతో శర్వా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన భోగి అనే సినిమాలో నటిస్తున్నారు.