Irfan Pathan T20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌కు దక్కాల్సిన క్రెడిట్ దక్కడం లేదని అన్నారు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.
2024లో జరిగిన T20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ సూర్యకు దక్కింది.
సూర్య కెప్టెన్సీలో భారత్ బాగానే ఆడుతోంది. సూర్య T20I విన్ పర్సంటేజ్ 84% ఉంది. ఇప్పటివరకు ఉన్న కెప్టెన్లతో పోలిస్తే విన్ పర్సంటేజ్ సూర్యకే ఎక్కువ.
అలాంటి సూర్యకు దక్కాల్సిన గౌరవం, క్రెడిట్ దక్కడం లేదని పఠాన్ బాధపడ్డారు. సూర్యను చూస్తే తనకు రోహిత్ శర్మనే గుర్తొస్తాడని.. ఇబ్బందుల్లో బౌలర్లకు అండగా నిలుస్తాడని అన్నారు.
ఫీల్డ్‌లో యాక్టివ్‌గా ఉంటాడని.. కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటాడని కొనియాడారు. సూర్యకు బౌలర్స్ కెప్టెన్ అని బిరుదు ఇవ్వచ్చని అన్నారు.





