Office Affairs: కార్యాలయాల్లో అక్రమ సంబంధాల విషయంలో భారత్ రెండో స్థానంలో ఉందట. ఇది అధికారికంగా YouGov. అనే అంతర్జాతీయ రీసెర్చ కంపెనీతో కలిసి ఆష్లే మ్యాడిసన్ అనే మరో సంస్థ చేసిన రీసెర్చ్‌లో తేలింది. ఈ రీసెర్చ్‌ను మొత్తం 11 దేశాల్లో చేసారు. భారత్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, జర్మనీ, ఇటలీ, మెక్సికో, స్పెయిన్, స్విట్జర్లాండ్, యూకే, అమెరికా దేశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ దేశాలకు చెందిన దాదాపు 14000 మంది రీసెర్చ్‌లో పాల్గొన్నారు. రీసెర్చ్ ముగిసాక ఆఫీసుల్లో అక్రమ సంబంధాలు ఎక్కువగా మెక్సికో దేశంలో ఉంటున్నాయని.. ఆ తర్వాత స్థానంలో భారత్ ఉందని తేలింది. భారత్‌లోని చాలా మటుకు కార్యాలయాల్లో పరిస్థితి ఎలా ఉందంటే.. ప్రతి 10 మందిలో నలుగురు అక్రమ సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారట.
ఇక జెండర్ విషయానికొస్తే.. ఆడవారి కంటే మగవారే ఇలాంటి ఎఫైర్స్ పెట్టుకుంటున్నారట. మహిళల్లో 20% మంది ఇలాంటి పనులు చేస్తే ఎక్కడ కెరీర్ దెబ్బతింటుందో ఎలాంటి పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని ఆలోచించి అలాంటి పనులకు దూరంగా ఉంటున్నారు. ఇక గ్లీడెన్ సర్వే ప్రకారం 35% మంది భారతీయులు ఓపెన్ రిలేషన్‌షిప్స్‌లో ఉన్నారు. కేవలం పెద్ద పెద్ద నగరాల్లోనే కాదు టియర్ 2, టియర్ 3 నగరాల్లోనూ ఇలాంటి కామన్ అయిపోతున్నాయి. అత్యధిక అక్రమ సంబంధాలు ఉండే నగరం తమిళనాడులోని కాంచీపురం అని రీసెర్చ్‌లో తేలింది.





